తమన్ కు ఊరటే.. కానీ

కొన్ని పనులకు ఎక్స్ పైరీ డేట్ ఉండదు. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్ లోఉన్నవాళ్ల పనికి అది వర్తించదు. కానీ అది నిత్యం నిత్యనూతనంగానే కనిపించాలి. అప్పుడే మనుగడంలో ఉంటుంది. లేదంటే నిన్న ఎంత టాలెంటెడ్ అయినా నేడూ అది చూపించకపోతే అంతే సంగతులు అని చాలామందిని చూశాం.. చూస్తున్నాం. కెరీర్ ఆరంభం నుంచీ కాపీ ట్యూన్స్ అనే మాటలు వినిపిస్తున్నా సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు సంగీత దర్శకుడు తమన్.

అతని పాటల్లో చాలా వరకూ గతంలో విన్నట్టుగానే అనిపిస్తాయి. కానీ అప్పటికి మాత్రం పనైపోతుంది. పైగా చాలా వేగంగా పనిచేస్తాడు అనే పేరు కూడా ఉంది. అయితే ఈ కాపీ క్యాట్ విమర్శలు పెరుగుతున్న టైమ్ లో అప్పట్లో తొలిప్రేమ అనే సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అప్పటి నుంచి కొత్త కొత్త ఆల్బమ్స్ ఇస్తున్నాడు. అఫ్ కోర్స్ కనీసం ఒక్క పాట అయినా మళ్లీ కాపీ మాటలను వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో దేవీ శ్రీ ప్రసాద్ ను కూడా బీట్ చేశాడు అనే పేరు తెచ్చుకున్నాడు.

ముఖ్యంగా త్రివిక్రమ్ తో ట్యూన్ అయిన తర్వాత అతని ట్యూన్స్ మారాయి. అరవింద సమేతతో అదరగొట్టాడు. అల వైకుంఠపురములో ట్యూన్స్ అయితే దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. అందుకే మరోసారి గుంటూరు కారం సినిమాకు తీసుకున్నాడు త్రివిక్రమ్. బట్ ఈ సినిమాకు సంబంధించి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది టెక్నీషియన్స్ తప్పుకున్నారు. ఈ లిస్ట్ లో తప్పుకుంటాడు అని కాదు కానీ.. తప్పించారు అనే టాక్ తమన్ విషయంలో వినిపించింది. ఎప్పుడూ లేనిది అతని ట్యూన్స్ ఆలస్యం కావడం వల్లే షూటింగ్ లేట్ అయిందనే టాక్ కూడా వచ్చింది. దీనికి తోడు మహేష్‌ కు తమన్ నచ్చలేదు అందుకే వద్దన్నాడు అనే రూమర్స్ కూడా వచ్చాయి. అసలు ఈ సినిమా రకరకాలుగా సాగుతోంది. దీంతో ఈ రూమర్ నిజమే అనుకున్నారు చాలామంది. బట్ త్రివిక్రమ్.. అతనిపై ఇంకా నమ్మకం కోల్పోలేదు. అందుకే మరో అవకాశం ఇచ్చాడు. ఇది తమన్ కు కాస్త ఊరటనిచ్చిన అంశం.


యస్.. గుంటూరు కారం నుంచి తమన్ ను తప్పించినట్టే అన్న దగ్గర నుంచి తప్పించలేదు అనే స్టేజ్ కు వచ్చాడు. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది అప్రస్తుతం. కానీ ఇప్పటికైనా తమన్ మారాలి. ఎప్పుడూ అవే ట్యూన్స్ కాకుండా కాస్త కొత్తగా ప్రయత్నించాలి. కేవలం తను పాట ఇవ్వకపోవడం వల్లే ఆగస్ట్ ఫస్ట్ షెడ్యూల్ లేట్ అయిందనేది నిజం. ఆ టైమ్ కు పాటను చిత్రీకరించాలనకున్నారు. బట్ ఇంకా ట్యూన్ రెడీ కాలేదు.

అది కొరియోగ్రాఫర్ దగ్గరకు వెళ్లాలి. అతనూ ప్రిపేర్ కావాలి. హీరోకూ నచ్చాలి. డ్యాన్స్ లు నేర్చుకోవాలి. ఇవన్నీ పెద్ద తతంగం. ఇది పూర్తి కావాలంటే ముందు ట్యూన్ రావాలి. ట్యూన్ లేట్ అని కాదు కానీ తమన్ కూడా మారాల్సిన టైమ్ వచ్చింది. లేదంటే అతన్ని మార్చేందుకు ఇండస్ట్రీ ఏ మాత్రం మొహమాట పడదు. ఇప్పటికే తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో పాగా వేస్తున్నారు. అన్ని పెద్ద సినిమాలకూ వాళ్లే సైన్ చేసి ఉన్నారు. ఈ తరుణంలో తమన్ మేల్కొనకపోతే.. ఆ ట్యూన్స్ కు ఇతని ట్యూన్స్ కు మధ్య తేడాలు కనిపెడితే ఇక అతని కెరీర్ కే ప్రమాదం. సో..ఈ గుంటూరు కారం కోసం కాస్త ఘాటైన.. ఇంతకు ముందు ఎప్పుడూ వినని ట్యూన్స్ సెట్ చేసుకుంటే బెటర్ అంటున్నారు అభిమానులు.

Related Posts