‘గుంటూరు కారం‘ టాక్.. ఇండస్ట్రీ హిట్ ఖాయం!

ఈ సంక్రాంతి సినిమాలలో ముందుగా చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’. సంక్రాంతి బరిలో ముందుగా.. హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోన్న ఈ సినిమాపై అంచనాలైతే మామూలుగా లేవు. ఇప్పటికే సెన్సార్ బృందం నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా అదిరిపోయే రివ్యూస్ వస్తున్నాయి.

ఈ సినిమాలో మాటల మాంత్రికుడు.. మహేష్ బాబును సరికొత్తగా ఆవిష్కరించాడని.. వెండితెరపై మహేష్ మాస్ జాతర మామూలుగా ఉండదనే కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, మాస్ యాక్షన్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించడం ఖాయమట. ఈ సినిమా త్రివిక్రమ్ గత చిత్రాలు ‘అత్తారింటికి దారేది.. అల.. వైకుంఠపురములో‘ తరహాలో ఫ్యామిలీతో సాగే ఎమోషనల్ ఎంటర్ టైనర్ అని.. అయితే.. ఆ రెండు చిత్రాలకు మించిన రీతిలో ‘గుంటూరు కారం‘ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ఇక.. మరికొద్ది గంటల్లో యు.ఎస్. ప్రీమియర్స్ తో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్స్ మొదలవ్వబోతున్నాయి.

Related Posts