సంక్రాంతి సినిమాల రన్ టైమ్స్ ఇవిగో..

ప్రతీతి ఇన్ స్టెంట్ గా జరిగిపోవాలి అనే ఈ ఫాస్ట్ టైమ్ లో.. సినిమాల నిడివి కూడా బాగా తగ్గిపోతుంది. రెండు, రెండున్నర గంటల లోపే లెంత్ సెట్ చేస్తున్నారు మేకర్స్. అయితే.. ఈమధ్య వచ్చిన ‘యానిమల్‘ వంటి కొన్ని సినిమాల లెంత్ మూడు గంటలు దాటిపోయిన సందర్భలూ ఉన్నాయి. ఇక.. రేపటి నుంచి సంక్రాంతి బరిలో సందడి చేయబోతున్న అన్ని సినిమాల రన్ టైమ్స్ పై క్లారిటీ వచ్చేసింది.

ఈ సంక్రాంతి బరిలో వస్తోన్న సినిమాలన్నింటిలోనూ ఎక్కువ రన్ టైమ్ వస్తోంది మహేష్ బాబు ‘గుంటూరు కారం‘. ఈ సినిమా నిడివి 159 నిమిషాలు. అంటే.. 2 గంటల 39 నిమిషాలు. రేపే ‘గుంటూరు కారం‘తో పాటు థియేటర్లలో సందడి చేయబోతున్న ‘హనుమాన్‘ సినిమా 2 గంటల 38 నిమిషాల నిడివితో వస్తోంది. ‘గుంటూరు కారం‘ కంటే ఒక్క నిమిషం నిడివి తక్కువన్నమాట.

మరోవైపు వెటరన్ స్టార్స్ నాగార్జున, వెంకటేష్ సినిమాలు రెండున్నర గంటల తక్కువ నిడివితోనే సందడి చేయబోతున్నాయి. నాగార్జన ‘నా సామిరంగ‘ చిత్రం 2 గంటల 26 నిమిషాల నిడివితో రాబోతుండగా.. వెంకటేష్ ‘సైంధవ్‘ 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో అలరించడానికి ముస్తాబైంది.

Related Posts