సుధ కోసం కర్ణుడి పాత్ర వదులుకున్న సూర్య

కొన్ని కాంబినేషన్స్ బలే సెట్ అవుతాయి. అలా సెట్ అయిన కాంబినేషన్ సూర్య – సుధ కొంగర. ఈ కాంబినేషన్ లో వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా ఎన్నో అవార్డులు గెలుచుకుంది. సూర్యతో పాటు హీరోయిన్ అపర్ణ బాలమురళికి బెస్ట్ యాక్టర్స్ గా నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అలాగే బెస్ట్ మూవీ, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లోనూ జాతీయ పురస్కారాలు దక్కాయి.

ఇలాంటి కాంబినేషన్ మరోసారి వస్తే చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. ఎలాంటి కథలో అయినా ఒదిగిపోయే ప్రతిభావంతమైన నటుడు సూర్య. అలాంటి నటుడుకి ఛాలెంజింగ్ స్క్రిప్ట్స్ వస్తే కాదంటాడా ..? ఇక ఈ కాంబినేషన్ లో సినిమాకు అంతా సిద్ధమైంది. అతి త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ కాబోతోంది.
ప్రస్తుతం సుధ కొంగర అక్షయ్ కుమార్ హీరోగా ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ యేడాదే విడుదల కాబోతోందీ చిత్రం. ఆ తర్వాత ఆమె సూర్యతోనే సినిమా చేయబోతోంది. ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడుగా జివి ప్రకాష్‌ కుమార్ నే సెలెక్ట్ చేసుకుంది సుధ. ఇక ఈ మూవీ కూడా ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందింది అని చెబుతున్నారు.


ఇక సూర్య ప్రస్తుతం కంగువ అనే ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దీని తర్వాత ఓమ్ ప్రకాష్‌ మెహ్రా డైరెక్షన్ లో బాలీవుడ్ లో మహా భారతం ఆధారంగా కర్ణ పాత్ర చేయాలి. ఈ సినిమా కర్ణుడి కోసమే తీయాలనుకున్నారు. బట్ సుధ కొంగర కోసం మోస్ట్ టాలెంటెడ్ అయిన ఓమ్ ప్రకాష్‌ కు ప్రస్తుతం గ్యాప్ ఇచ్చాడు సూర్య. నిజానికి ఈ మూవీ అతనికి ఫస్ట్ బాలీవుడ్ మూవీ అవుతుంది. అయినా తన ఫేవరెట్ డైరెక్టర్ కోసం బాలీవుడ్ ఆఫర్ ను వదులుకున్నాడు సూర్య. అలాగే ప్రస్తుతం ఈ తరహా కథలకు మంచి ఆదరణ ఉంటోంది. అయినా సుధ చెప్పిన కథకే ఓటు వేస్తున్నాడు సూర్య. మరి ఈ సారి ఈ కాంబో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related Posts