కమల్ హాసన్ ను ఒప్పించిన లోకేష్‌

లోకేష్ కనకరాజ్.. ప్రస్తుతం సౌత్ లోమోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. తీసింది తక్కువ సినిమాలే అయినా అతని సౌండ్ భారీగా వినిపిచింది. ఫస్ట్ మూవీ మా నగరంతో ఆకట్టుకుని తర్వాత కార్తీతో తీసిన ఖైదీతో కమర్షియల్ గానూ విమర్శియల్ గానూ మెప్పించాడు. ఈ మూవీ చూసి ఏకంగా విజయ్ ఆఫర్ ఇచ్చాడు. విజయ్ ని కొత్తగా ప్రజెంట్ చేస్తూ మాస్టర్ తీశాడు. ఇదీ హిట్.

ఇక కమల్ హాసన్ కు చాలా యేళ్ల తర్వాత విక్రమ్ తో తిరుగులేని బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఈ మూవీ ఏకంగా 400 కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించింది. కమల్ కు ఈ స్థాయి విజయం పడి దశాబ్దం దాటిందంటే అతిశయోక్తి కాదు. అందుకే లోకేష్‌ ఓ మాట అడగ్గానే వెంటనే ఒప్పేసుకున్నాడు.


లోకేష్ కనకరాజ్ ఇప్పుడు విజయ్ తో ”లియో” అనే సినిమా చేస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండటం విశేషం.ఇతర కీలక పాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ యేడాది దసరా కానుకగా అక్టోబర్ 19న ప్యాన్ ఇండియన్ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అయితే ఈ నెల 22న హీరో విజయ్ బర్త్ డే. ఈ సందర్బగా ఓ టీజర్ ను రెడీ చేస్తున్నాడు లోకేష్‌ కనకరాజ్. అయితే ఈ టీజర్ కు వాయిస్ ఓవర్ ఉంటుందట. ఆ వాయిస్ ను కమల్ హాసన్ తో చెప్పింబోతున్నారు.


తనకు అంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు అడిగితే కమల్ హాసన్ కాదంటాడా..? అందుకే లియో కు వాయిస్ ఓవర్ చెప్పడానికి వెంటనే ఓకే చెప్పాడట. విశేషం ఏంటంటే.. తెలుగులో కూడా కమల్ తోనే వాయిస్ ఓవర్ చెప్పించబోతున్నారు అంటున్నారు. మొత్తంగా లియోతో మరో కొత్త కంటెంట్ ను చూపించబోతున్నాడు లోకేష్‌ కనకరాజ్. దీంతో పాటు ఖైదీ, విక్రమ్, లియో లను కలిపి ఓ మల్టీవర్స్ ను క్రియేట్ చేయబోతున్నాడు. ఈ మల్టీవర్స్ లో హీరోలెవరో తెలుసు కదా..? విలన్స్ గా సూర్య, సంజయ్ దత్ ఉంటారన్నమాట.

Related Posts