ఏంటి.. ఈ సినిమా రీ రిలీజా..

రీ రిలీజ్ అంటే ఏ దశకు వచ్చిందో తెలిపే ఖచ్చితమైన ఉదాహరణ. ఒకప్పుడు రీ రిలీజ్ అంటే క్లాసిక్ సినిమాలకు మాత్రమే పరిమితమై ఉండేది. అక్కడి నుంచి అభిమాన హీరోల బిగ్గెస్ట్ హిట్స్ వరకూ వచ్చాయి. అటుపై తమ అభిమాన హీరోల సినిమాలు అప్పట్లో ఆడకపోయినా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అనిపించుకున్నా.. మళ్లీ విడుదల చేస్తూ అభిమానుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇప్పటికే ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ ఏమైపోతుందో అని జనరల్ మూవీ లవర్స్ తెగ ఫీలైపోతుంటే వారి బాధను అర్థం చేసుకున్నట్టుగా ఇప్పుడు ఓ బి గ్రేడ్ తరహా చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నాం అంటూ వచ్చిన కొత్త పోస్టర్స్.. ఈ ట్రెండ్ ఎక్కడికి పోతుందో తెలిపేలా ఉంది.


ఒకప్పుడు మళయాలంలో హీరోయిన్ గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా మీనన్ నటించిన సినిమా రతి నిర్వేదం. 2011లో విడుదలై ఎరోటిక్ ఫిల్మ్ గా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ విడుదలైన యేడాదే శ్వేతా మీనన్ తెలుగులో నటించిన రాజన్న సినిమా విడుదల కావడం విశేషం. తెలుగులోనూ అదే పేరుతో విడుదలై ఇక్కడా ఆకట్టుకుంది. నాగ దోషం వల్ల పెళ్లి చేసుకోకుండా ఉన్న ఒక మహిళతో టీనేజ్ కుర్రాడు ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతనికి ఆకర్షితురాలవుతుంది. ఒకానొక సమయంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. అదే సమయంలో ఆమెను పాము కాటువేసి మరణిస్తుంది. అయితే ఈ క్రమంలో దొంగచాటుగా ఆమె అందాలు ఆస్వాదిస్తూ ఉంటాడా కుర్రాడు. సినిమా అంతా ఒకరకమైన ఎరోటిక్ మూడ్ లో సాగుతుంది. ఇప్పుడీ చిత్రాన్నే సిఎల్ఎన్ మీడియా వాళ్లు తెలుగులో మళ్లీ విడుదల చేస్తున్నారు.


శ్వేతా మీనన్ తో పాటు టీనేజర్ గా శ్రీజిత్ విజయ్ నటించాడు. టికే రాజీవ్ కుమార్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. మొత్తంగా ఈ తరహా సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారంటే ఇక మిగిలింది షకీలా చిత్రాలేనేమో.

Related Posts