సినిమాలకు పనికిరాని సూపర్ స్టార్

సినిమాలకు పనికిరాని సూపర్ స్టార్ మహేష్‌ బాబు.. పదం కాస్త ఘాటుగా ఉన్నా.. ఇండస్ట్రీ మొత్తం ఇదే చెప్పుకుంటోందిప్పుడు. అవును.. ఏ సినిమాలతో అయితే ఆయన తండ్రి మకుటం లేని హీరోగా వెలిగాడో.. ఏ సినిమాలతో అయితే ఇతను హీరోగా అందరికీ తెలిశాడో.. ఏ సినిమాలతో అయితే స్టార్డమ్ తెచ్చుకుని కోట్లు కూడబెట్టుకుని సూపర్ స్టార్ కూడా అనిపించుకున్నాడో.. ఇప్పుడు ఆ సినిమాలను అత్యంత చులకనగా చూస్తున్నాడు మహేష్‌ బాబు.

యస్.. సాధారణ ప్రేక్షకులు ఇది అబద్ధం అనుకుంటారేమో.. కానీ నిజం. మహేష్‌ కు ఇప్పుడు సినిమాల కంటే యాడ్స్ మీదే ప్రేమ పెరిగిపోయింది. ఫ్యామిలీ ఫ్యామిలీ యాడ్స్ చేస్తూ బతికేద్దామనుకుంటున్నారు. ఈ యాడ్స్ వెనక భర్తతో పాటు కూతురును కూడా డైరెక్ట్ చేస్తున్నది శ్రీమతి నమ్రతా శిరోద్కర్. ఆమె గీసిన గీతను దాటకుండా చెప్పిన యాడ్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు ఈ సూపర్ స్టార్.

ఎందుకంటే మహేష్‌ కు ఒక యాడ్ చేస్తే మూడు నుంచి నాలుగు కోట్లు వస్తాయి. ఒక యేడాది పాటు అగ్రిమెంట్. దీనికోసం కేవలం మూడు నాలుగు రోజులు కాల్షీట్స్ ఇస్తే సరిపోతుంది. దీంతో ఇదే బావుందనుకున్నాడో లేక.. ఇది చాలు అనుకుంటున్నాడో కానీ యాడ్స్ కు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు సినిమాలకు ఇవ్వడం లేదు.

ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ కు రాడు. వచ్చిన చెప్పిన టైమ్ కు రాడు. లొకేషన్ కు రావాల్సిన డేట్స్ లో వెకేషన్ పెట్టుకుంటాడు. దీంతో అప్పటికే అంతా సిద్ధం చేసుకున్న నిర్మాతలు నిండా మునుగుతున్నారు. అయినా అవేం పట్టనట్టు అతను మాత్రం వెకేషన్స్ లో మునిగితేలుతున్నాడు.


యాడ్స్ చేసుకోవడం అతని వ్యక్తిగతం. కానీ సినిమాలకు కమిట్ అయ్యి నిర్మాతలను ఇబ్బంది పెట్టడం బాధ్యతా రాహిత్యం. ఇష్టం వచ్చినట్టుగా కాల్షీట్స్ మారుస్తూ.. ఇతర ఆర్టిస్టులనూ ఇబ్బంది పెట్టడం.. వృత్తి ద్రోహం. ఇలా చేయడంలో మాత్రం సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు మహేష్‌ బాబు. అందుకే అతన్ని సినిమాలకు పనికిరాని లేదా సినిమాలు వద్దు అనుకుంటోన్న సూపర్ స్టార్ అని పిలుచుకుంటున్నారు ఇండస్ట్రీలో.


మహేష్‌ వారసుడుగా వచ్చాడు. కానీ ఆయన్ని వారసుడుగా నిలిపిన వ్యక్తి కృష్ణగారితో పోలిస్తే.. ఆయన నిర్మాతల పాలిట దేవుడు.. ఈయన నిర్మాతల పాలిట… వద్దులే. అలా ఉంది పరిస్థితి. ఫైట్ మాస్టర్స్ నచ్చలేదని షెడ్యూల్స్ మార్చేస్తాడు. నచ్చిన ఫైట్ మాస్టర్ తెస్తే చెప్పిన టైమ్ కు రాడు. కథలో కంటిన్యూస్ గా మార్పులు అంటుంటాడు.. అంటూ నిర్మాతలు వాపోతున్నారు.

ఇలా చేస్తే ఎవరూ సూపర్ స్టార్ అనరు. అంటే ఆ మాటకే అవమానం అనేది కొంతమంది ఫీలింగ్. ఏదేమైనా యాడ్స్ మోజులో పడి తనను ఇంత వాడిని చేసిన సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టడం ఏమంత గొప్ప కాదు. మహేష్‌ రేంజ్ కు ఇలాంటి మాటలు పడాల్సి రావడం అవమానమే తప్ప ఆనందం అయితే కాదు. మరి ఇకనైనా పద్ధతి మార్చుకుని పని చేసుకుంటూ వెళితే మంచిదేమో..

Related Posts