‘ఆయ్‘ మూవీ నుంచి స్పెషల్ ఉగాది గ్లింప్స్

డెబ్యూ మూవీ ‘మ్యాడ్‘తో మంచి హిట్ అందుకున్న నార్నే నితిన్.. ఇప్పుడు రెండో సినిమా ‘ఆయ్‘తో రెడీ అవుతున్నాడు. తొలి చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేసిన ఎన్టీఆర్ బావమరిది నితిన్.. ఇప్పుడు తన రెండో చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వంటి పెద్ద సంస్థలో చేస్తున్నాడు. ఇప్పటికే ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకున్న ‘ఆయ్‘ మూవీ ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలయ్యాయి.

ఆమధ్య ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఉగాది సందర్భంగా ‘ఆయ్‘ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘ఆయ్‘ మూవీ హీరోయిన్ నయన్ సారిక చేసిన ఉగాది పచ్చడిని హీరో అండ్ బ్యాచ్ చెడగొట్టాలనుకోవడం.. ఆ తర్వాత వాళ్లే ఇరుక్కుపోవడం వంటి సన్నివేశాలతో ఈ ఉగాది గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. అంజి కె. మణిపుత్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి త్వరలో సెకండ్ సింగిల్ రాబోతుంది.

Related Posts