మరోసారి సౌత్ వర్సెస్ నార్త్ క్లాష్

దక్షిణాది చిత్రాల పాన్ ఇండియా ప్రభంజనం పెరిగిన తర్వాత బాలీవుడ్ సినిమాల హవా తగ్గింది. ఒకప్పుడు వెండితెర రారాజుల్లా వెలుగొందిన బాలీవుడ్ స్టార్స్.. మళ్లీ కోర్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ మళ్లీ పుంజుకుంటోంది. ఈ ఏడాది కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రూపంలో బాలీవుడ్ కి రెండు బడా బ్లాక్ బస్టర్స్ దక్కాయి.

బాలీవుడ్ కి దీటుగా ఎదిగిన సౌత్ ఇండస్ట్రీ.. బీటౌన్ స్టార్స్ కి సవాలు విసురుతూనే ఉంది. ఒకప్పుడు బాక్సాఫీస్ క్లాషెస్ ను సాధ్యమైనంత వరకూ తగ్గించుకునేలా చూసేవారు బాలీవుడ్ హీరోలు. అయితే.. ఇప్పుడు ఏరికోరి సౌత్ సినిమాలతో బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నారు.

ఈ ఏడాది డిసెంబర్ లో బాలీవుడ్ మూవీ ‘డంకి‘.. సౌత్ సెన్సేషనల్ మూవీ ‘సలార్‘ మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఇప్పటికే ఖరారైంది. అసలు డిసెంబర్ 22న ముందుగా విడుదల తేదీ ఖరారు చేసుకుంది షారుఖ్ ఖాన్ ‘డంకి‘. అయితే.. గతంలో ‘కె.జి.యఫ్‘కి కలిసొచ్చిన క్రిస్టమస్ సీజన్ నే ఇప్పుడు ‘సలార్‘ కోసం ఎంచుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అలా.. డిసెంబర్ లో బాలీవుడ్ వర్సెస్ సౌత్ బడా క్లాష్ అయితే రాబోతుంది.

ఇక.. వచ్చే యేడాది ఆగస్టులోనూ ఇలాంటి క్లాషే ఎదురవ్వబోతుంది. సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించడానికి 2024, ఆగస్టు 15న రాబోతుంది ‘పుష్ప 2‘. ఇప్పటికే యావత్ భారతదేశంలో ‘పుష్ప‘ సృష్టించిన వసూళ్ల వర్షం గురించి తెలిసిందే. దీంతో ‘పుష్ప 2‘పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక.. ‘పుష్ప 2‘ ఉన్నా.. అదే డేట్ కి ఫిక్సైంది బాలీవుడ్ మూవీ ‘సింగమ్ అగైన్‘.

రోహిత్ శెట్టి ‘సింగమ్‘ సిరీస్ లోని థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ ‘సింగమ్ అగైన్‘. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ పోలీసాఫీసర్ గా టైటిల్ రోల్ లో కనిపించబోతున్నాడు. దీపిక పదుకొనె కూడా పోలీసాఫీసర్ గా దుమ్మురేపడానికి సిద్ధమవుతోంది. ఇక.. లేటెస్ట్ గా ఈ మూవీలో మరో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ని కూడా తీసుకున్నారు. ఈ మూవీలో టైగర్ కూడా పవర్ ఫుల్ కాప్ రోల్ లో అలరించనున్నాడట.

తాజాగా.. ‘సింగమ్ అగైన్‘లో టైగర్ ష్రాఫ్ నటిస్తున్నట్టు కన్ఫమ్ చేస్తూ కొన్ని ఫోటోస్ రిలీజ్ చేశారు. ఇంకా.. ఈ మూవీలో అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ కూడా నటించే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తంమీద.. ఈ ఏడాది డిసెంబర్ లో ‘డంకీ వర్సెస్ సలార్‘.. వచ్చే యేడాది ఆగస్టులో ‘పుష్ప2 వర్సెస్ సింగమ్ అగైన్‘ క్లాష్ అయితే సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.

Related Posts