ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ఎన్టీఆర్

‘ఆర్.ఆర్.ఆర్‘ చిత్రంలోని ‘నాటు నాటు‘ పాటతో యావత్ ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేశారు ఎన్టీఆర్, చరణ్. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా రాజమౌళికి పేరుంటే.. అంతర్జాతీయ స్థాయిలో మన నటుల సత్తా చాటిన హీరోలుగా వీరిద్దరూ పేరు సంపాదించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆస్కార్ నుంచే మరో అరుదైన గౌరవం మన తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కింది.

పాత్ర ఎలాంటిదైనా అందులోకి పరాకాయ ప్రవేశం చేసే అరుదైన నటుడు ఎన్టీఆర్. ఈ తెలుగు తేజానికి ఇప్పుడు ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో స్థానం లభించింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. ఈ లిస్టులో ఇండియా నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ‘అంకితభావం కలిగిన ఈ నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. తెరపై వారి హావభావాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి గొప్ప నటీనటులను యాక్టర్స్ బ్రాంచ్ లోకి ఆహ్వానిస్తున్నాం‘ అని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ తెలియజేసింది. ఎన్టీఆర్ తో పాటు ఈ లిస్టులో మరో నలుగురు హాలీవుడ్ నటులు ఉన్నారు.

Related Posts