సిద్ధార్థ్ కు సారీ చెప్పిన శివన్న

సౌత్ లోని ప్రతి రాష్ట్రంలోని రాజకీయాలు వైవిధ్యంగా ఉంటాయి. ఏ స్టేట్ పాలిటిక్స్ మరో స్టేట్ పాలిటిక్స్ తో పోల్చడానికి లేకుండా ఉంటుంది. ఇది మన దేశ ఏకత్వంలో భిన్నత్వం అనే సూత్రాన్ని కూడా సూచిస్తుంది. ఈ వైరుధ్యంలో కూడా ఒక వెరైటీ ఏంటంటే.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే కావేరీ జలాలకు సంబంధించిన సమస్యలు కనిపిస్తుంటాయి. ఇతర పార్టీలు అధికారంలో ఉంటే కావేరి గురించిన సమస్యలు వినిపించవు.

ఇప్పుడు ఈ పాలిటిక్స్ ఎందుకంటే.. తాజాగా తమిళ్ నటుడు సిద్ధార్థ్ ‘చిత్తా ‘ అనే తన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లారు. ఇది తమిళ్ సినిమా. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. అయితే చిత్తా మూవీ ప్రమోషన్స్ లో సిద్ధార్థ్ ఉండగా.. కొందరు బిజెపి నాయకులు ఆ ప్రమోషన్స్ ను అడ్డుకున్నారు. తమ రాష్ట్రానికి కావేరీ జలాలు రాకుండా అడ్డుకుంటోన్న తమిళ నటుల సినిమాలు మనకెందుకు.. ఇతను మనకు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు.. అందువల్ల మీరు కూడా ప్రమోషన్ చేయొద్దు అంటూ మీడియా వారిని కూడా బెదిరించారు. ఈ విషయంలో సిద్ధార్థ్ మొదట కామ్ గానే ఉన్నా.. తర్వాత తనదైన శైలిలో బదులిచ్చే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్లు మాత్రం ఆ కార్యక్రమాన్ని రసాభాసగా మార్చారు.


ఇప్పటికే సిద్ధార్థ్ ను అడ్డుకోవడం పై కొందరు తమిళీయన్స్ కన్నడిగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ బిజెపి పార్టీ అధికారంలో ఉండగా ఒక్క రోజు కూడా కావేరి జలాల గురించి మాట్లాడని వాళ్లు కాంగ్రెస్ రాగానే మళ్లీ ఎప్పట్లానే కావేరీ పాలిటిక్స్ చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే అంశంపై కన్నడ సూపర్ స్టార్.. కరుణాద చక్రవర్తిగా చెప్పుకునే శివరాజ్ కుమార్ రియాక్ట్ అయ్యాడు. ఓ పబ్లిక్ మీటింగ్ లో ఉన్న ఆయన ఈ విషయంపై మాట్లాడాడు. తమ వాళ్లు చేసింది తప్పు అని ఖండించాడు. జరిగిన ఘటనపై సిద్ధార్థ్ కు సారీ కూడా చెప్పాడు.

దయచేసి కన్నడ ప్రజలు ఇలాంటివి చేయొద్దని.. కన్నడ ప్రజలు అంటే అన్ని భాషల ప్రజలను ప్రేమిస్తారు. అన్ని భాషల సినిమాలను ఆదరిస్తారు అని అన్నాడు.మొత్తంగా ఈ వ్యవహారంలో సిద్ధార్థకు రెండు రాష్ట్రాల నుంచి మంచి మద్ధతు లభిస్తోంది. మరోవైపు ఈ సినిమా గురించి కూడా బాగా మాట్లాడుకుంటున్నారు. కమల్ హాసన్ అయితే తన మహానది సినిమా కంటే చిత్తానే బాగా నచ్చిందని కితాబు ఇచ్చాడు. కంప్లీట్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్.యూ అరుణ్ కుమార్ డైరెక్ట్ చేయగా.. సిద్ధార్థే నిర్మించడం విశేషం.

Related Posts