HomeMoviesటాలీవుడ్హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్

హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్

-

హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉండే స్టార్ మాస్ మహారాజ రవితేజ. ఇప్పటివరకూ టాలీవుడ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన రవితేజ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ చేస్తోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు‘. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథతో వంశీకృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలకు ముస్తాబవుతోంది.

‘టైగర్ నాగేశ్వరరావు‘ సినిమాలో రవితేజాకి జోడీగా గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనువిందు చేయనున్నాడు. వీరితో పాటు మరో కీలక పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతుంది. రేణు దేశాయ్ తెరపై సందడి చేసి దాదాపు 20 ఏళ్లయ్యింది. పవన్ కళ్యాణ్ ‘బద్రి‘తో పరిచయమైన రేణు దేశాయ్ ఆ తర్వాత ‘జానీ‘లోనూ కథానాయికగా నటించింది. మళ్లీ 20 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు‘లో నటిస్తుంది.

1970ల కాలం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రేణు దేశాయ్ హేమలత లవణం పాత్రలో కనిపించబోతుందట. హేమలత లవణం ప్రముఖ సామాజిక సేవకురాలు. ప్రముఖ కవి గుర్రం జాషువా కుమార్తె. అలాగే ప్రముఖ హేతువాది గోపరాజ్ లవణం భార్య. అలాంటి హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతుందంటూ ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది ‘టైగర్ నాగేశ్వరరావు‘ టీమ్. ఈ పోస్టర్ లో బిడ్డను ఎత్తుకొని కళ్లజోడుతో కనిపించింది రేణూ. పోస్టర్ తో ఆకట్టుకున్న రేణు దేశాయ్ సినిమాలో తన పాత్రతో ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.

ఇవీ చదవండి

English News