వార్2 తర్వాత ఎన్టీఆర్ సినిమా ఎవరితో

ఆర్ఆర్ఆర్ తో దేశవ్యాప్తంగా వచ్చిన మైలేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. డబ్బింగ్ సినిమాల ద్వారా ఎన్టీఆర్ నార్త్ ఆడియన్స్ కు కొంత పరిచయమే అయినా.. ఆర్ఆర్ఆర్ లో అతని నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఆ క్రేజ్ ను పెంచుకుంటూ వెళితే ప్యాన్ ఇండియన్ మార్కెట్ లో కూడా మ్యాజిక్స్ చేయొచ్చని ఫిక్స్ అయ్యాడు ఎన్టీఆర్.

ఆ టార్గెట్ గానే కథలు ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల శివతో చేస్తోన్న సినిమా ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ టార్గెట్ గానే వస్తోంది. ఈ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ భారీగా పెరుగుతుందంటున్నారు మేకర్స్. సముద్రం బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఎన్టీఆర్ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు అంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్.


దేవర తర్వాత ఎన్టీఆర్ డైరెక్ట్ హిందీ మూవీ చేయబోతున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి వార్2 అనే సినిమాకు సైన్ చేసి ఉన్నాడు. ఈ యేడాది డిసెంబర్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్కుతుంది. ఇది కూడా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్. అయితే వార్2లో ఎన్టీఆర్ కాస్త నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు అనే టాక్ ఉంది. అలాంటిది ఆల్రెడీ జై లవకుశలో చేసి ఉన్నాడు కాబట్టి అతనికి పెద్ద సమస్యేం కాదు. అలాగని విలన్ కాదు. జస్ట్ నెగెటివ్ టచ్ ఉన్న రోల్ అంతే.


వార్2 తర్వాతేంటీ అనే ప్రశ్న కూడా ఎన్టీఆర్ కెరీర్ కు సంబంధించి వినిపిస్తోంది. మామూలుగా అయితే ఈ విషయం ఎవరూ అడగరు. బట్ అప్పుడెప్పుడో వినిపించిన ప్రశాంత్ నీల్ సినిమా ఉంది కదా..? అదేమైందీ.. ప్రశాంత్ నీల్ తో చేస్తాడా లేక మరో దర్శకుడు వస్తాడా అనే క్లారిటీ కోసమే ఈ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఆల్మోస్ట్ సమాధానం దొరికిందంటున్నారు.

శాండల్ వుడ్ మీడియా నుంచి వినిపిస్తోన్న రిపోర్ట్ ఏంటంటే.. ప్రశాంత్ నీల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తోనేనట. యస్.. ఎన్టీఆర్ వార్ 2 మూవీని కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేస్తారట. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని టాక్. శాండల్ వుడ్ చెబుతున్నది ఏంటంటే.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ 2024 జూన్ లో ప్రారంభం అవుతుందట.

ఈ లోగా ఏప్రిల్ లో లాంఛనంగా ఓపెనింగ్ కార్యక్రమం చేస్తారట. అటుపై షూటింగ్ స్టార్ట్ అయితే ఏకధాటిగా ఉంటుందంటున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది.. ప్రశాంత్ నీల్ సలార్ ప్రమోషన్స్ లో క్లియర్ గా చెప్పేస్తాడు. బట్.. ఎన్టీఆర్ కెపాసిటీకి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడు పడితే ఆ మూవీ హై ఓల్టేజ్ కు మీనింగ్ లా ఉంటుందని చెప్పొచ్చు.

Related Posts