టాలీవుడ్

పెళ్లి రిసెప్షన్ కు ”కేసీఆర్” ను ఆహ్వానించిన శర్వానంద్

టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ రీసెంట్ గా ఒక ఇంటి వాడు అయ్యాడు. పెద్దలు కుదిర్చిన సంబంధంగా రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ వివాహం రెండు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితుల మధ్య జైపూర్ లో డెస్టినేషన్ మ్యారేజ్ గా జరిగింది.

తర్వాత టాలీవుడ్ తో పాటు ఇక్కడ ప్రముఖుల కోసం ఈ శుక్రవారం సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశాడు శర్వానంద్. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించాడు శర్వానంద్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరల్ గా మారాయి.

అంటే ఆహ్వానించడం గొప్పా అని కాదు. బట్.. కొత్త పెళ్లికొడుకు స్వయంగా వెళ్లి ఇన్వైట్ చేయడం చాలామందికి ఆసక్తిని కలిగించింది. మరి ఈ రిసెప్షన్ కు కేసీఆర్ హాజరవుతాడా లేదా అనేది చెప్పలేం కానీ .. శర్వానంద్ కుటుంబ నేపథ్యాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వెళ్లే అవకాశాలున్నాయి.

శర్వా ఫ్యామిలీది అత్యంత సంపన్నమైన కుటుంబం. నగరంతో పాటు దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలూ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులతో సాన్నిహిత్యాన్ని ఏ రాజకీయ నాయకుడూ వదులుకోడు. కాబట్టి కేసీఆర్ వెళ్లినా వెళ్లకపోయినా తన కుటుంబం నుంచి మాత్రం ఎవరో ఒకరు అటెండ్ అవుతారు అనుకోవచ్చు.

Telugu 70mm

Recent Posts

‘Kalki’ Is Sure To Hit A Thousand Crores

In just two days, 'Kalki' collected Rs. 300 crores at the box office worldwide. In…

1 hour ago

Kamal Is The Third To Enter The Field For ‘Bharateeyudu 3’

The movie 'Bharateeyudu' has once again made Kamal Haasan the best actor at the national…

1 hour ago

Ravi Teja Is Setting Up A Crazy Project

Malineni Gopichand's project with Mass Maharaja Ravi Teja went to Bollywood hero Sunny Deol. The…

2 hours ago

‘కల్కి’ వెయ్యి కోట్లు కొట్టడం పక్కా..!

కేవలం రెండు రోజుల్లోనే 'కల్కి'.. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూళ్లను సాధించింది. లాంగ్ రన్…

2 hours ago

‘భారతీయుడు 3’ కోసం రంగంలోకి మూడో కమల్

విశ్వనటుడు కమల్ హాసన్ ను మరోసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలిపిన చిత్రం 'భారతీయుడు'. శంకర్ దర్శకత్వంలో రూపొందిన…

2 hours ago

క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేస్తోన్న రవితేజ

మాస్ మహారాజ రవితేజాతో మలినేని గోపీచంద్ చేయాల్సిన ప్రాజెక్ట్ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ కి వెళ్లింది. మైత్రీ మూవీ…

2 hours ago