చరిత్రను తప్పుగా చెప్పలేను : రజాకార్‌ దర్శకుడు యాట సత్యనారాయణ

యాటా సత్యనారాయణ డైరెక్షన్‌లో రాబోతున్న పిరియాడిక్‌ ఫిల్మ్‌ ‘రజాకార్‌’. గూడూరు సత్యనారాయణ రెడ్డి నిర్మించిన ఈ మూవీలో బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటిస్తున్నారు. మార్చి 15 న రిఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు యాటా సత్యనారాయణ మీడియాతో ముచ్చటించారు.

చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాను. మన జీవిత చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా తీశాం. అలాంటి సినిమాకు, అలాంటి చరిత్రకు రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే రేటింగ్స్ ఇవ్వొద్దు అన్నాను.సినిమా నచ్చలేదని, దర్శకుడు బాగా చేయలేదని విమర్శించే హక్కు అందరికీ ఉంటుందన్నారు.
మా నిర్మాత ఓ రాజకీయ నాయకుడు కాబట్టి కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారేమో. కానీ నేను ఓ క్రియేటర్‌గా అలా ఆలోచించడం లేదు. చరిత్రను చూపించాను. మన చరిత్ర చెప్పాలనుకున్నాను.. తెరపైకి తీసుకొచ్చానన్నారు.

సెన్సార్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఓ పదహారు పాయింట్లు అడిగారు. వాటికి అన్ని ఫ్రూప్స్ చూపించాను. కొన్ని మితి మీరిన వయలెన్స్ సీన్లు ఉన్నాయని, వాటికి మాత్రం కట్స్ చెప్పారన్నారు దర్శకుడు యాటా సత్యనారాయణ.రజాకార్ వ్యవస్థ వల్ల తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో జరిగింది. ఆ టైంలో చాలా ప్రాంతాలకు చాలా మంది పారిపోయారు. నాకు ఈ సినిమా చేస్తున్న టైంలో కేరళ, చెన్నై నుంచి ఫోన్‌లు వచ్చాయి. మన వాళ్లు ప్రతీ ఏరియాలో ఉన్నారని చెప్పారు యాటా.
భారతీ భారతీ పాటకూ, బీజేపీ పార్టీకి సంబంధం ఏంటి?.. భారతి అంటే నా అమ్మ, నా మాతృభూమి.. నా దేశం.. దానికీ పార్టీకీ సంబంధం లేదన్నారు.

చరిత్రను తప్పుగా చెప్పలేను. తప్పుగా చెబితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతాను. కల్పితం చేసి, హీరోయిన్లు పెట్టి చరిత్రను తప్పుగా చెప్పలేను. జరిగిన చరిత్రను చెప్పాలనుకున్నాను. అందుకే రజాకార్ తీశానన్నారు. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ ఒక్కరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. టీజర్‌కు నేషనల్ వైడ్‌గా డిబేట్లు జరిగాయన్నారు యాటా సత్యనారాయణ.
ఈ చిత్రం మార్చి 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయనున్నారు.

Related Posts