ఎన్టీఆర్ పై జపాన్ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఎంత గొప్ప నటుడున్నాడో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ లో ఒకడు అంటే అతిశయోక్తి లేదు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే దమ్మున్న నటుడు ఎన్టీఆర్. స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతోన్న అతని ప్రతిభను ప్రపంచానికి చూపించింది ఆర్ఆర్ఆర్ సినిమా.

రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీతో ఇండియాలో ఇంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ ఉన్నారా అని ప్రపంచమే విస్తుపోయింది. ఆ స్థాయిలో అదరగొట్టారు రామ్ చరణ్‌, ఎన్టీఆర్. అయితే ఈ ఇద్దరు ఎవరు బెస్ట్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇద్దరూ సమానమే కాకపోతే ఎన్టీఆర్ కాస్త ఎక్కువ సమానం అని ముళ్లపూడి స్టైల్లో అంటారు.


ఇక తాజాగా అతని ప్రతిభకు ఫిదా అయిపోయిన జపాన్ విదేశాంగ మంత్రి యోషిమస హయాషి సైతం తను ఎన్టీఆర్ కు వీరాభిమానిని అని ట్విట్టర్ వేదికగా ప్రకటించడం సంచలనమైంది. తనకు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ అంటే ఇష్టం అని ప్రకటించాడతను. నిజానికి ఈ సినిమా జపాన్ లో కూడా విడుదలైంది. అక్కడ ఏకంగా మన కరెన్సీలో 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతే కాదు.. వంద రోజుల పాటు ఆడిన ఫస్ట్ ఇండియన్ మూవీగానూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ ఎన్టీవోడి దమ్ము పెరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు.

Related Posts