ధనుష్‌ సినిమాలో నాగ్ పేరు లేదే

మల్టీ టాలెంటెడ్ స్టార్ హీరో ధనుష్‌ తెలుగులో మంచి జర్నీని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ మూవీ సార్ ఇక్కడ కమర్షియల్ గా మంచి విజయమే సాధించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ధనుష్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన అతని లేటెస్ట్ కెప్టెన్ మిల్లర్ టీజర్ ఇంప్రసివ్ గా ఉంది. ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఈ చిత్రంలో అతనితో పాటు సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ కూడా ఉన్నారు.

ఇది ధనుష్‌ కు 49వ సినిమా. 50వ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో ఎప్పుడో అనౌన్స్ అయిన ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమా తెరపైకి వచ్చింది. అతని బర్త్ డే సందర్భంగా గ్రీటింగ్స్ చెబుతూ అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు.


ధనుష్ 51 అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కు వెళుతుందని ప్రకటించారునిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ లు. శేఖర్ కమ్ముల ఇప్పటి వరకూ ధనుష్ చూడని కోణంలో అతన్ని ప్రెజెంట్ చేయబోతున్నాడట. ఈ కథే ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందే ఈ సినిమాలోనూ భారీ తారాగణం ఉంటుందట. అందుకోసం చాలామంది స్టార్స్ తో చర్చిస్తున్నట్టు తమ ప్రకటనలో తెలిపారు.


అయితే నిన్నటి వరకూ ఈ చిత్రంలో నాగార్జున కూడా నటించబోతున్నాడు అనే ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదు అని వీరి ప్రకటనతో తేలిపోయింది. లేదా ఇంకా ఆయనతో చర్చిస్తున్నారనే అనుకోవాలి. ఏదేమైనా నాగార్జున ఈ ప్రాజెక్ట్ లో భాగమైతే అతనికే ప్లస్ అవుతుందనేది విశ్లేషకుల అంచనా. ఇప్పటికే ఒక విజయం కోసం నానా తంటాలు పడుతున్నాడు. మరోవైపు కెరీర్ లో 100వ సినిమాకు దగ్గరయ్యాడు. నెక్ట్స్ ఏ మూవీ చేసినా అది 99వది అవుతుంది. ఈ మూవీని బ్లాక్ బస్టర్ చేసుకుని 100వ సినిమాకు హైప్ తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే మల్టీస్టారర్ కు ఓకే చెప్పడం లేదా లేక ఇంకైవైనా కారణాలున్నాయా అనేది అప్పుడే తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ధనుష్‌ మూవీలో నాగార్జున లేడు అని తేలిపోయింది.

Related Posts