జనవరి 1న థియేటర్లలోకి ‘సర్కారు నౌకరి‘

యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల నటించిన ‘బబుల్ గమ్‘ సినిమా డిసెంబర్ 29న థియేటర్లలోకి రాబోతుంది. ఇక.. ఈ చిత్రం వచ్చిన రెండు రోజులకే సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన ‘సర్కారు నౌకరి‘ విడుదలకు ముస్తాబవుతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణంలో ఆర్కే టెలీ షో బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాకి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించారు. లేటెస్ట్ గా ఈ మూవీని న్యూ ఇయర్ స్పెషల్ గా జనవరి 1న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్.

ఆకాష్ కి జోడీగా భావన నటించిన ఈ సినిమాలో తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి శాండిల్య సంగీతాన్నందించగా..
సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ తో పాటు టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Related Posts