మాస్ మహారాజ కి జోడీగా క్లాస్ మహారాణి

మాస్ మహారాజ రవితేజ- టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో మాస్ రీయూనియన్ కన్ఫమ్ అయ్యింది. వీరిద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమాని ఇటీవలే ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ మూవీ ‘రెయిడ్’కి రీమేక్ అనే ప్రచారం ఉంది. లేటెస్ట్ గా ఈ మూవీలో మాస్ మహారాజకి జోడీగా ఓ క్లాస్ మహారాణిని ఎంపిక చేసినట్టు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.

పూణెకి చెందిన భాగ్యశ్రీ బోర్సేని ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశారు. భాగ్యశ్రీ ఇప్పటికే బాలీవుడ్ లో ‘యారియానా 2’ చిత్రంలో నటించింది. ఇప్పుడు రవితేజ మూవీతో టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చీరకట్టులో అందాలను ఒలికిస్తూ అందంగా కనిపిస్తుంది భాగ్యశ్రీ. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుంది.

Related Posts