డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘సర్కారు నౌకరీ’

సింగర్ సునిత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా పరిచయం అవుతున్న సినిమా సర్కారు నౌకరి.గంగనమోని శేఖర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి కే రాఘవేంద్రరావు నిర్మాత కావడం విశేషం. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.

ఆకాశ్ సరసన భావన హీరోయిన్ గా పరిచయం అవుతోంది. సునిత కొడుకును రాఘవేంద్రరావు పరిచయం చేస్తున్నాడు అనగానే చాలామంది ఆయన స్టైల్లో ఉంటుందనుకున్నారు. కానీ పూర్తిగా ఇది కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా అని అర్థం అవుతోంది.1996లో తెలంగాణలోని కొల్లాపూర్లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని రూపొందించిన సినిమా అని టీజర్ మొదట్లోనే వేశారు. అప్పట్లో సర్కారు నౌకరీ అంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టుగానే భావించేవారు.చిన్నదైనా పెద్దదైనా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆ వ్యక్తికి ఉండే గౌరవం వేరే ఉండేది. అలా సర్కారు నౌకరీ సాధించిన ఓ కుర్రాడు ఆ ఉద్యోగం వల్లే పెళ్లికి సిద్ధమవుతాడు. అందరూ ఆ అమ్మాయిని సర్కారు నౌకరీ ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటోన్న అదృష్టవంతురాలు అంటుంటారు.

మరి ఈ కుర్రాడు చేసే ఉద్యోగం ఏంటీ అంటే.. ఎయిడ్స్ వ్యాధిపట్ల అవగాహన కల్పిస్తుండటం. ఆ ప్రాంతంలో ఎయిడ్స్ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు నిరోధ్ వాడకం గురించి చెప్పడం అన్నమాట. ఆ రోజుల్లో ఎయిడ్స్ అనే మాట వింటేనే వణికిపోయారు. అలాంటిది ఈ ఉద్యోగం చేసే వ్యక్తిని ఎలా చూశారు అనేది పాయింట్. ఇంతకు మించి టీజర్ లో ఇంకే వివరాలూ లేవు. మరి సినిమాగా ఎలా ఉంటుందో కానీ.. ఇదైతే మంచి కాన్సెప్ట్ అనే అనుకోవాలి.

Related Posts