ఇలియానాకు కొడుకు పుట్టాడు

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఇలియానా. ఈ తరంలో ఫస్ట్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న బ్యూటీగా రికార్డ్ సాధించింది. అందరు టాప్ హీరోలతోనూ ఆడిపాడింది. రాఖీ లాంటి సినిమాల్లో మంచి నటన కూడా చూపించింది.

తనకు మంచి ఆఫర్స్ ఉన్న టైమ్ లోనే సడెన్ గా టాలీవుడ్ నుంచి మాయమైంది. బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కెరీర్ ఆశించినంత ఆశాజనకంగా లేకపోయినా అక్కడే కొనసాగింది.కొన్నాళ్లుగా ఫోటోషూట్స్ కే పరిమితమైన ఈ గోవా బ్యూటీ సడెన్ గా తను ప్రెగ్నెంట్ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అందుకు కారణం ఎవరో మాత్రం మొదట చెప్పలేదు.

రీసెంట్ గా అతని ఫోటోను పరిచయం చేసింది. విదేశీయుడు. మరి అతనేనా కాదా అనే క్లారిటీ కూడా లేదు. ఇక నెలలు నిండుతున్న ప్రతిసారీ తన ఫోటోస్ అప్డేట్ చేస్తూ వచ్చిన ఇలియానా తాజాగా డెలివరీ అయింది. ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.


విశేషం ఏంటంటే.. తను ఆగస్ట్ 1నే డెలివరీ అయింది. ఆ విషయం తాజాగా అప్డేట్ చేసింది. బాబుకు పేరు కూడా పెట్టింది. కోవా ఫీనిక్స్ డోలా అనే పేరు పెట్టింది. కోవా అంటే యోధుడు అని అర్థమట. ఇక ఫీనిక్స్ డోలా అనేది ఆమె బాయ్ ఫ్రెడ్ పేరు అని అందరికీ తెలుసు. ఈ సందర్భంగా తను చాలా సంతోషంగా ఉన్నాననే క్యాప్షన్ యాడ్ చేసింది. మొత్తంగా హజ్బెండ్ అనే పదం లేకుండానే ఇలియానా బిడ్డకు జన్మనిచ్చింది.

Related Posts