ఫైనల్ గా సంయుక్త సైన్ చేసింది

తెలుగులో బ్లాక్ బస్టర్ బ్యూటీ అంటే ఈ మధ్య కాలంలో సంయుక్త మీనన్ నే చెప్పాలి. హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతోందీ భామ. ఫస్ట్ మూవీ భీమ్లా నాయక్ తర్వాత వరుసగా బింబిసార, సార్ వంటి మూవీస్ తో హిట్స్ అందుకున్న సంయుక్త విరూపాక్షతో అదరగొట్టింది. ఈ మూవీలో తన పాత్రే హైలెట్. అలాగే తన నటన కూడా.

క్లైమాక్స్ లో తన నటన చూసి చాలామంది భయపడ్డారు అంటే అది తన ప్రతిభకు నిదర్శనం. ఆశ్చర్యంగా ఇన్ని హిట్స్ ఉన్నా.. అమ్మడు టాప్ రేస్ లోకి ఎంటర్ కాలేకపోతోంది. తనకంటే తక్కువ విజయాలున్న వాళ్లు.. తక్కువ టాలెంట్ ఉన్నవాళ్లు అందలం ఎక్కుతుంటే సంయుక్త మాత్రం సినిమా సినిమాకు ఎదురుచూడాల్సి వస్తుంది. విరూపాక్ష తర్వాత కమిట్ అయిన సినిమా ఏంటీ అంటే నిన్నటి వరకూ సమాధానం లేదు. అంతకు ముందే ఒప్పుకున్న డెవిల్ తప్ప తన ఖాతాలో కొత్త సినిమా కనిపించలేదు. బట్ ఫైనల్లీ సంయుక్తకు మరో ప్రాజెక్ట్ వచ్చింది. వెంటనే సైన్ చేసింది.


కార్తికేయ2 బ్లాక్ బస్టర్ కావడంతో తను ప్యాన్ ఇండియన్ స్టార్ ను అని ఫీలవుతున్న నిఖిల్ సిద్ధార్థ్ కు జోడీగా నటించబోతోంది సంయుక్త. కార్తికేయ2 తర్వాత భారీ అంచనాలతో మరోసారి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి స్పై లా వచ్చాడు నిఖిల్. బట్ ఈ మూవీ డిజాస్టర్ అయింది.

అయినా ప్రస్తుతం మరో ఫిక్షనల్ మైథలాజికల్ స్టోరీతో “స్వయంభు” అనే సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రంలోనే సంయుక్త హీరోయిన్ గా నటించబోతోంది. వచ్చే శుక్రవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. సో.. నవంబర్ 24న డెవిల్ సినిమా విడుదలవుతుంది. ఇదీ హిట్ అయ్యే లక్షణాలున్న సినిమాలానే కనిపిస్తోంది. మరి ఆ తర్వాతనైనా సంయుక్త ఫేట్ మారుతుందేమో చూడాలి.

Related Posts