హాఫ్ సెంచరీ కొట్టిన సామజవరగమనా

చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తే పరిశ్రమకు పెద్ద కళ వస్తుంది. ఎప్పుడో కానీ వచ్చే పెద్ద హీరోల సినిమాల కంటే రెగ్యులర్ గా వచ్చే చిన్న హీరోల సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ ఎక్కువ కళకళలాడుతుంది. అయితే ఈ సినిమాలు ఆకట్టుకోవడం, ఆడటం అంత సులువేం కాదు. చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు అంటారు కానీ.. అది నిజం కాదు.

దాదాపు ఆరు నెలలుగా తెలుగులో పెద్ద సినిమాల సందడి లేదు. మరి ఎన్ని చిన్న సినిమాలు హిట్ అయ్యాయి..? అంటే ఆన్సర్ ఉండదు. యస్.. ఇక్కడ కంటెంటే ప్రధానం. అది లేదు కాబట్టే ఆదిపురుష్ లాంటి సినిమాలను కూడా లైట్ తీసుకున్నారు ఆడియన్స్. సో.. ప్రేక్షకులకు నచ్చితే నెత్తిమీద పెట్టుకుంటారు. అందుకు ఖచ్చితమైన ఉదాహరణ సామజవరగమనా.

నెల క్రితం విడుదలైన సామజవరగమనా మొదటి ఆట నుంచే ఆడియన్స్ నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా ఈ చిత్రానికి ప్రీమియర్స్ వేయడం ఇంకా కలిసొచ్చిఇంది. రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. అదో ట్రెండ్ లానూ అయిందిప్పుడు. ఇక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూసిన ప్రతి ఒక్కరినీ తెగ నవ్వించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగానూ టాలీవుడ్ ట్రేడ్ ను ఆశ్చర్యపరిచింది.


కేవలం 10 కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన సామజవరగమనా తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లు కలెక్ట్ చేసి హాఫ్ సెంచరీ కొట్టింది. శ్రీ విష్ణు రేంజ్, మార్కెట్ కు ఇది చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. ఈ సినిమాకు తారాగణం కూడా పెద్ద ప్లస్ అయింది. నరేష్,రెబా మోనికా జాన్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రఘుబాబు లాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు ఉండటం వల్లే ఈ కామెడీ సినిమా అంత పెద్ద హిట్ అయింది.


ఈ మూవీతో దర్శకుడుగా రామ్ అబ్బరాజుకు మంచి క్రేజ్ వచ్చింది. మీడియం రేంజ్ హీరోలు అతని కథలు వినేందుకు సిద్ధంగా ఉన్నారిప్పుడు. సో.. ఎప్పుడైనా కంటెంట్ దే అప్పర్ హ్యాండ్.. అంతే.

Related Posts