సీనియర్ హీరోల సినిమాలకు బజ్ ఏదీ..

సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి.. ఇద్దరూ సీనియర్ హీరోలు. ఒక్కొక్కరు ఒక్కో ఇండస్ట్రీలో కింగ్స్. ఇద్దరి సినిమాలూ ఆగస్ట్ 11న విడుదల కాబోతున్నాయి. విశేషం ఏంటంటే.. ఈరెండు సినిమాల్లోనూ తమన్నానే హీరోయిన్. ఆశ్చర్యంగా రెండు భాషల్లోనూ ఈ రెండు సినిమాలకు మినిమం బజ్ కూడా రాలేదు.

కాస్త ఆశ్చర్యంగా, అభిమానులకు ఆగ్రహంగా ఉన్నా ఇది నిజం అంటోంది ట్రేడ్. రజినీకాంత్ జైలర్ మూవీతో ఆగస్ట్ 11న తమిళ్ తో పాటు తెలుగులోనూ వస్తున్నాడు. మెగాస్టార్ భోళా శంకర్ గా అదే రోజు తెలుగులో మాత్రం వస్తున్నాడు. ఇప్పటి వరకూ ఈ రెండు సినిమాల నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. తమిళ్ లో తమన్నా పాట దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది.

కానీ అది పూర్తిగా తమన్నా ఎకౌంట్ లో పడింది తప్ప సినిమాకు ప్లస్ కాలేదు. ఇక తెలుగులో ఇంతకు ముందు వచ్చిన పాటలు పెద్దగా ఎక్కలేదు. టీజర్ సైతం మెగా ఎలివేషన్స్ కే పరిమితం అయింది తప్ప పెద్దగా హైప్ తేలేదు.


ఒకప్పుడు ఈ ఇద్దరి సినిమాలు విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ కు పండగలా ఉండేది.ఇంతకు ముందు సినిమాల వరకూ కూడా ఓ రేంజ్ లో హైప్ కనిపించింది. కానీ అనూహ్యంగా ఈ సినిమాలకు మాత్రం సడన్ గా డౌన్ అయింది. రజినీకాంత్ అంటే వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. బట్ మెగాస్టార్ వాల్తేర్ వీరయ్యగా ఆల్రెడీ బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఉన్నాడు.

అయినా భోళాకు ఆశించినంత బజ్ రావడం లేదంటే ఆశ్చర్యం కాక మరేంటీ..? అయితే ఈ సినిమాకు బజ్ రాకపోవడానికి ప్రధాన కారణం.. తమిళ్ రీమేక్ కావడంతో పాటు ఆల్రెడీ ఆ తమిళ్ సినిమా తెలుగులో డబ్ కావడం. మరోటి ఎప్పుడూ ఫామ్ లో లేని.. ఎప్పుడో దర్శకత్వాన్ని వదిలేసిన మెహర్ రమేష్‌ దర్శకుడు కావడం. బట్ మెగా ఇమేజ్ తో ఈ మూవీ వర్కవుట్ అయితే మెహర్ రమేష్ కెరీర్ కు కొత్త టర్న్ వస్తుందేమో.


ఇక తమిళ్ లో జైలర్ కు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇతను ఇంతకుముందు అజిత్ తో చేసిన వలిమై ఏమంత ఆకట్టుకోలేదు. కానీ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోయాయి. అవి ఎలాగూ స్టంట్ మాస్టర్స్ చేస్తారు.అయితే జైలర్ లో రజినీకాంత్ తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్, సునిల్ వంటి భారీ తారాగణం ఉంది. అయినా ఇప్పటి వరకూ ఈ మూవీపై ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. విడుదలకు పెద్దగా టైమ్ కూడా లేదు. పైగా తమిళ్ తో పాటు తెలుగులోనూ ప్రమోషన్స్ చేయాలి. మరి ఆడియన్స్ అటెన్షన్ ను ఎప్పుడెలా గ్రాబ్ చేస్తారో కానీ.. ప్రస్తుతానికైతే ఈ సీనియర్స్ సినిమాలకు పెద్ద క్రేజ్ అయితే కనిపించడం లేదు.

Related Posts