సామజవరగమన ట్రైలర్.. ఫుల్ ఫన్

శ్రీ విష్ణు, రెబా జాన్ జంటగా నటించిన సినిమా సామజవరగమనా. ఈ నెల 29న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఆల్రెడీ వచ్చిన టీజర్ ను బట్టి ఇదో కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీ అనిపించింది.

అదే మరింతగా హైలెట్ చేస్తూ ట్రైలర్ ఉంది. కొన్నాళ్లుగా శ్రీ విష్ణుకు సరైన హిట్స్ పడటం లేదు. ఈ ట్రైలర్ చూస్తే అతనికి ఓ మంచి హిట్ గ్యారెంటీ అనిపించేలా క్లీన్ కామెడీతో కనిపిస్తోంది. కాలేజ్ లో ఉండగా తను ప్రేమించిన అమ్మాయి రాఖీ కట్టిందని అప్పటి నుంచి తనకు ఐ లవ్యూ చెప్పిన అమ్మాయిలందరితోనూ బలవంతంగా రాఖీలు కట్టించుకునే కుర్రాడి పాత్రలో శ్రీ విష్ణు కనిపిస్తున్నాడు.

అతను ఏదో మల్టీ ప్లెక్స్ థియేటర్ లో బాక్స్ ఆఫీస్ ఉద్యోగిగా నటించాడు. అతని ఫ్యామిలీ మొత్తం థియేటర్ కు వెళ్లినప్పుడుల్లా పాప్ కార్న్స్ తింటూ అతని జీతం మొత్తం అయిపోయేలా చేస్తుంటారు. ఇక తనను ప్రేమించిన అమ్మాయి అతని ఇంట్లోనే ఉంటుంది. ఇంటి మనిషిగా ఆమెకు అన్ని పనులూ చెబుతుంటాడు. ఫ్యామిలీతో పాటు తన లవ్ మేటర్ ఇంకా యాక్షన్ కూడా కనిపిస్తోన్న ఈ ట్రైలర్ చూస్తోంటే శ్రీ విష్ణు హిట్ పడేలానే ఉంది.


ఈ తరహా కామెడీ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా రాలేదు. మంచి కంటెంట్ కూడా ఉంటే ఆడియన్స్ కు మంచి వినోదం అవుతుంది. భారీ ఓపెనింగ్స్ లేకపోయినా.. మౌత్ టాక్ తో వీకెండ్ వరకూ మాగ్జిమం రికవర్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ సామజవరగమనా మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Related Posts