ప్యాన్ ఇండియన్ డార్లింగ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ మానియాలో ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన సలార్ టీజర్ గొప్పగా లేకపోయినా.. ఓ రేంజ్ వ్యూస్ తో యూ ట్యూబ్ ను షేక్ చేస్తోంది
. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ సంపాదించుకున్న ఈ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ సలార్ మేకర్స్ కు కరెక్ట్ గానే అర్థమైంది. వ్యూస్ ఉన్నా.. టీజర్ బావుంది అన్న టాక్ అయితే లేదు. ఈ విషయం మేకర్స్ కు కూడా అర్థమైంది. దీన్ని ఇలాగే వదిలేస్తే బిజినెస్ లో మార్పులు వస్తాయని తెలుసు. అందుకే వెంటనే ట్రైలర్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సెప్టెంబర్ 28న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ ను ఆగస్ట్ లోనే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఇక అందరి దృష్టీ ట్రైలర్ పై పడింది. అయితే లేటెస్ట్ గా ఈ మూవీ సెకండ్ పార్ట్ కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది.
ఫస్ట్ పార్ట్ ను ఈ సెప్టెంబర్ లో విడుదల చేస్తున్నారు. రెండో భాగానికి పెద్దగా ఆలస్యం లేకుండానే వచ్చే యేడాది సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారు. అంటే సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారు అనే కదా అర్థం. ఎంతైనా ప్రశాంత్ నీల్ తెలివైన వాడే. కేజీఎఫ్ విషయంలో జరిగిన మిస్టేక్ ను రిపీట్ కాకుండా చూసుకున్నాడు. మళ్లీ సెకండ్ పార్ట్ కు షూటింగ్ అంటే ప్రభాస్ డేట్స్ విషయంలో సమస్యలు తప్పవు.
అందుకే ఒకేసారి తనకు కావాల్సిన సీన్స్ తీసుకుంటే.. తర్వాత రెండు భాగాల్లో ఏ సీన్ ఎక్కడ అనే క్లారిటీ అతనికి ఉంటుంది కదా..? అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెకండ్ పార్ట్ రిలీజ్ డేట్ కూడా సెట్ చేసుకున్నాడు. సో.. ఇప్పటి వరకూ సంక్రాంతి తర్వాత సమ్మర్ రేస్ లో ప్రభాస్ ఉంటాడా లేదా అనుకున్నవారికి కూడా ఓ క్లారిటీ వచ్చింది. సమ్మర్ లో కూడా సలార్ మానియా ఉండబోతోంది. ఈ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత సంక్రాంతి లేదా ఆ తర్వాత సలార్ 2 ఖచ్చితమైన రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారట. సో.. అప్పటికి షెడ్యూల్ అయి ఉన్న సినిమాల్లో మార్పులు తప్పవన్నమాట
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…