వాళ్లు హృదయం లేని వాళ్లు – సాయిపల్లవి

సాయి పల్లవి పెళ్లి చేసుకుంది.. ఇదుగో ఫోటోస్.. అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొందరు ఇది నిజమే అనుకుంటున్నారు. పైగా ఆ ఫోటోస్ లో ఇద్దరూ దండలు మార్చుకుని ఉన్నట్టుగా ఉంది. అదే కొందరు నమ్మడానికి కారణమైంది. బట్ నిజానికి ఆ ఫోటోస్ పెళ్లికి సంబంధించినవో లేక ఎంగేజ్మెంట్ వో కాదు. సాయి పల్లవి తమిళ్ లో శివకార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్ రోజున ప్రధానమైన నటులకు వేసిన దండలు. సాయి పల్లవితో పాటు ఉన్న వ్యక్తి ఆ చిత్ర దర్శకుడు.. రాజ్ కుమార్ పెరియసామి.

ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తుండటం విశేషం. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రం ఓపెనింగ్ రోజున వేసిన దండలను పెళ్లి దండలుగా మార్చారు కొందరు. పైగా ఆ ఫోటోలో పక్కనే శివకార్తికేయన్ కూడా ఉంటాడు. కానీ అతన్ని కట్ చేశారు. అలాగే దర్శకుడి చేతిలో క్లాప్ బోర్డ్ ఉంటుంది. అదీ కట్ చేసి.. సాయి పల్లవి పెళ్లి చేసుకుందహో అంటూ సోషల్ మీడియాలో వదిలేస్తే అది కాస్తా వైరల్ అయింది.


ఇక తన పెళ్లి విషయంపై సాయి పల్లవి సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇది హృదయం లేని వాళ్లు చేసే పని అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన ఎక్స్(ట్వీట్) చూస్తే.. ” హానెస్ట్ లీ నేను రూమర్స్ అస్సలు లెక్క చేయను. కానీ నా స్నేహితుడు, కుటుంబానికి చెందని వ్యక్తి గురించి కావడంతో స్పందిస్తున్నాను. ఉద్దేశ్య పూర్వకంగా కట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అది చూస్తే నాకు అసహ్యం కలిగింది. నేను చేస్తోన్న కొత్త సినిమా గురించి నేను ఆనందంగా పెట్టిన పోస్ట్ ను ఇలా వక్రీకరించి శునకానందం పొందుతున్నారు. పనీ పాటా లేని హృదయం లేని వాళ్లే ఇలాంటివి చేస్తున్నారు. ఈ నీచమైన పని చూసి నేను చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నాను.. ” అని పోస్ట్ చేసింది.


మొత్తంగా సాయి పల్లవి సినిమా కు సంబంధించిన ఫోటోస్ ను మీరు ఇక్కడ చూడొచ్చు. ఏదేమైనా సోషల్ మీడియాలో ఇలాంటి దరిద్రాలకు అడ్డు కట్ట వేయడం అయ్యే పని కాదు. కానీ ఎవరికి వారు స్వీయ వ్యక్తిత్వంతో ప్రవర్తించాలి. లేదంటే ఇలాంటి నీచమైన ఆలోచనలే వస్తాయి.

Related Posts