HomeMoviesటాలీవుడ్రూల్స్ రంజన్ ట్రైలర్.. హిలేరియస్

రూల్స్ రంజన్ ట్రైలర్.. హిలేరియస్

-

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా రూల్స్ రంజన్. డిజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి, మెహర్ చాహల్ హీరోయిన్లుగా నటించారు. ఏఎమ్ రత్నం తనయుడు రత్తినం కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 28న విడుదల కాబోతోంది. తాజాగా రూల్స్ రంజన్ ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రతి సినిమాతో అంచనాలు పెంచడం.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం కొన్నాళ్లుగా కిరణ్ కు కామన్ అయింది. ఈ ట్రైలర్ చూస్తే ఆ కామన్ పాయింట్ ను బ్రేక్ చేయబోతున్నాడా అనిపిస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోందీ ట్రైలర్. దీంతో పాటు మంచి లవ్, ఎమోషన్స్ కూడా మిక్స చేసినట్టున్నారు. అయితే ఎమోషన్స్ కూడా హెవీ డోస్ లో లేకపోవడం కొత్తగా ఉంది.


ట్రైలర్ ఆరంభంలోనే ‘ ప్రతి తండ్రీ నన్ను చూసి నేర్చుకోవాల.. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, నాన్న మందిచ్చి ఓదార్చాలి’ అంటూ గోపరాజు రమణ చెప్పిన డైలాగ్ పేలిపోయింది. అటు పై రూల్స్ రంజన్ గా కిరణ్ తన ఫ్రెండ్స్ తో చేసే కామెడీ, హీరోయిన్ ఎంట్రీ, వెన్నెల కిశోర్ హడావిడీ చూస్తే కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ ను చూడబోతున్నాం అనే ఫీలింగ్ వచ్చింది. ఇక విచిత్రంగా మందులో ఉన్నప్పుడు ప్రేమగా ఉండి, మత్తు దిగిన తర్వాత తనను ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టుగా ఉన్న హీరోయిన్ ది ప్రేమ అని ఎలా అనుకోవాలనే కిరణ్ డైలాగ్ తో ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను కూడా కొత్త డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది.

ముఖ్యంగా డైలాగ్స్ అన్నీ పేలిపోయాయి. సినిమాలో కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా కిరణ్ కు ఓ మంచి హిట్ పడుతుంది. అయితే కేవలం డైలాగ్స్ మాత్రమే కాక కాస్త కంటెంట్ కూడా బలంగా ఉండాల్సిందే. అసలే ఇప్పుడు ఎంత పెద్ద హీరోలకైనా టాక్ తెలుసుకున్న తర్వాతే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. బట్ కిరణ్ అబ్బవరం ఈ సారి అస్సలు నిరాశపరచడు అనిపించేలా ఉందీ ట్రైలర్.

ఇవీ చదవండి

English News