జవాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ సునామీ

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించింది. అసలే ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆక్యుపెన్సీ కూడా వచ్చింది. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని అన్ని పరిశ్రమలూ అంచనా వేశాయి. పఠాన్ కలెక్షన్స్ ను జవాన్ సులువుగా దాటేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే దానికి ముందు మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయా అని చూశారు ఆడియన్స్. ఆ అంచనాలకు మించి మొదటి రోజు జవాన్ కలెక్ట్ చేసింది.


ప్రపంచ వ్యాప్తంగా జవాన్ కు ఫస్ట్ డే 150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలయ్యాయి. ఇది జైలర్ కంటే చాలా ఎక్కువ. బాలీవుడ్ నుంచి ఆల్ టైమ్ రికార్డ్. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని నార్త్ లో కంటే సౌత్ లోనే ఎక్కువగా చూశారు. బాలీవుడ్ లో రిలీజ్ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ కేవలం 58. 67 పర్సెంట్ మాత్రమే ఉంది. కానీ తమిళనాడులో హయ్యొస్ట్ గా 81 శాతం థియేటర్స్ ఫుల్ అయ్యాయి. ఇటు తెలుగులో కూడా 65శాతం వరకూ ఫుల్ అయ్యాయి. అంటే బాలీవుడ్ లో ఫుల్ అయ్యి ఉంటే ఈ కలెక్షన్స్ లో ఇంకా చాలా పెద్ద ఫిగర్ యాడ్ అయ్యేది.


ఈ 150 కోట్లలో ఇండియా నుంచి వసూలైన కలెక్షన్స్ 75 కోట్లు. మిగతా అంతా ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, యూఎస్ఏ నుంచే కావడం మరో విశేషం. పఠాన్ తో పోలిస్తే ఈ సినిమా చాలా చాలా బెటర్ గా ఉంది. కంటెంట్ పరంగా బలమైన కథ, కథనాలు ఉన్నాయి. అవే ఈ రేంజ్ కలెక్షన్స్ కు కారణం.. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి ఈ శనివారం నుంచి భారీగా వసూళ్లు మొదలవుతాయని చెప్పాలి. ఎలా చూసినా జవాన్.. నాన్ బాహుబలి రికార్డ్స్ ను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Posts