7 రోజులు 660 కోట్లు

జవాన్ కలెక్షన్ల తుఫాన్ ఆగడం లేదు. వీకెండ్ లోనే కాదు.. వీక్ డేస్‌ లోనూ స్ట్రాంగ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. సోమవారం మాత్రమే ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వల్ల కాస్త డల్ అయిన జవాన్ మళ్లీ పుంజుకుంది.

కేవలం 7 రోజుల్లోనే 660 కోట్ల కలెక్షన్స్ సాధించి వెయ్యికోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాకు మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అంతకు ముందే షారుఖ్ ఖాన్ పఠాన్ తో 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఆ ఊపును కొనసాగిస్తూ ఈ చిత్రం కూడా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. దీనికి తోడు పఠాన్ కంటే బలమైన కంటెంట్ కూడా ఈ చిత్రంలో ఉంది.

షారుఖ్ డ్యూయొల్ రోల్ లో పాటు అట్లీ డైరెక్షన్ లో అదరగొట్టాడు. వీరికి నయనతార, ప్రియమణి, దీపికా పదుకోణ్ వంటి సపోర్టింగ్ రోల్స్ తో.. విజయ్ సేతుపతి వంటి బలమైన విలన్ కూడా తోడై ఉన్నాడు. ఇక సౌత్ ఫ్లేవర్ బాలీవుడ్ కు విపరీతంగా నచ్చింది. ప్రతి సీన్ ఓ ఎలివేషన్ సీన్ లా హైలెట్ అయింది. అలాగే రైతు సమస్యలు, ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలు, ఆర్మీలో ఆయుధాల సమస్యలతో పాటు మరెన్నో సోషల్ ఇష్యూస్ ను టచ్ చేయడం ..ఆ సీక్వెన్స్ లన్నీ ఆడియన్స్ హార్ట్స్ ను టచ్ చేస్తూ సాగడం వల్లే జవాన్ కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.


ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ ఊపు కొనసాగుతుందంటున్నారు. దీనికి తోడు ఈ శుక్రవారం వచ్చే సినిమాల్లో ఏవీ స్ట్రాంగ్ గా కనిపించడం లేదు. అది జవాన్ కు సౌత్ లో కూడా ప్లస్ అవుతుంది. అందుకే ఇక్కడ నుంచి కూడా ఈ సినిమా కొన్నవాళ్లంతా భారీ లాభాలు చూస్తారంటున్నారు. ఏదేమైనా పఠాన్, జవాన్ అంటూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో తను హిట్స్ కొట్టడమే కాదు.. బాలీవుడ్ కే కొత్త ఊపిరి పోశాడు షారుఖ్ ఖాన్.

Related Posts