మెగాస్టార్ కి ఝలక్ ఇచ్చిన మోహన్ లాల్

‘లూసిఫర్‘.. మలయాళం ఇండస్ట్రీలో ఓ సెన్సేషనల్ మూవీ. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం 2019లో విడుదలై మాలీవుడ్ లో సరికొత్త కలెక్షన్ల రికార్డులు నెలకొల్పింది. ఇప్పటికీ మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ‘లూసిఫర్‘దే అగ్ర స్థానం.

‘లూసిఫర్‘ చిత్రంతో దర్శకుడిగా మారాడు మరో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమాలో మోహన్ లాల్ ను ప్రెజెంట్ చేసిన విధానానికి, స్టైలిష్ మేకింగ్ కి ఎంతో అప్లాజ్ వచ్చింది. ఇక ‘లూసిఫర్‘ చివరిలో సీక్వెల్ పైనా హింట్ ఇచ్చాడు డైరెక్టర్ పృథ్వీరాజ్. లేటెస్ట్ గా ‘లూసిఫర్‘కి సీక్వెల్ గా ‘ఎల్2ఇ: ఎంపురాన్‘ పేరుతో సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు. తొలి భాగాన్ని నిర్మించిన ఆశీర్వాద్ సినిమాస్ తో పాటు ఈ సీక్వెల్ కోసం మరో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కూడా రంగంలోకి దిగింది.

‘లూసిఫర్‘ సినిమా కేవలం మలయాళంకే పరిమితమైతే ఇప్పుడు సీక్వెల్ ను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. దాంతో మెగాస్టార్ చిరంజీవి తీద్దామనుకున్న ‘గాడ్ ఫాదర్2‘కి బ్రేక్ పడిందనే అనుకోవచ్చు. ‘లూసిఫర్‘ రీమేక్ గానే చిరంజీవి ‘గాడ్ ఫాదర్‘ చిత్రం రూపొందింది. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ‘గాడ్ ఫాదర్‘ మంచి విజయాన్నే సాధించింది.

దాంతో ‘గాడ్ ఫాదర్‘కి సీక్వెల్ గా ‘గాడ్ ఫాదర్ 2‘ వస్తుందని అప్పట్లో మోహన్ రాజా ప్రకటించాడు. కానీ ఇప్పుడు ‘ఎంపురాన్‘ ఆగమనంతో ‘గాడ్ ఫాదర్2‘ ప్రిపరేషన్స్ కు ఫుల్ స్టాప్ పడొచ్చేమో అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

Related Posts