టాలీవుడ్

రవితేజ సూపర్ హిట్ రీ రిలీజ్ అవుతుంది.

మాస్ మహరాజ్ అనగానే వెంటనే గుర్తొచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో మొదటి వరుసలో ఉండే సినిమా వెంకీ. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఉంటుంది.. ఎవరికి వారు అద్భుతమైన టైమింగ్ తో అదరగొట్టారు.

అరగంటకు పైగా ఉండే ట్రైన్ ఎపిసోడ్ అయితే తెలుగు సినిమాల్లోనే కాదు.. ఏ భాషలో అయినా న భూతో అన్నట్టుగానే ఉంటుంది. రవితేజ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, హీరోయిన్ కోసం పడే పాట్లు, బ్రహ్మానందం, ఏవియస్, వేణు మాధవ్ ట్రాక్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాగా ఈ చిత్రాన్ని నిలబెడతాయి. అదే టైమ్ లో ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ గానూ కనిపిస్తుంది.

హీరోతో పాటు అతని ఫ్రెండ్స్ పోలీస్ ట్రెయినింగ్ కు సెలెక్ట్ అయ్యే తతంగంలో కాస్త సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా తీసుకున్నా.. అవేవీ గుర్తుకు రాకుండా చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపీ మోహన్ ల రచనా పటిమ వెంకీని ఓ క్లాసిక్ ఎంటర్టైనర్ గా నిలిపాయంటే అతిశయోక్తి కాదు.


2004 మార్చి 26న విడుదలైన ఈ మూవీకి ట్రెమండస్ హిట్ అనే టాక్ వచ్చింది. రవితేజ సరసన స్నేహ హీరోయిన్ గా నటించింది. ఇతర పాత్రల్లో బ్రహ్మానందం,ఏవిఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్, అశుతోష్‌ రాణా, శ్రీనివాస రెడ్డి, చిత్రం శ్రీను, రామచంద్ర, మల్లిఖార్జున రావు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని మరో విశేషం ఏంటంటే.. ప్రతి పాత్రకూ ఓ గుర్తింపు ఉంటుంది. అన్ని పాత్రలూ తమదైన ముద్రను చూపిస్తాయి. రాశి ఐటమ్ సాంగ్ అదిరిపోతుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో హైలెట్.


అదంతా ఓకే కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఏం లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు టివిల్లో యూ ట్యూబ్ ల్లో చూసిన ఈ సినిమాను మళ్లీ థియేటర్స్ లో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇలాంటి సినిమాలకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఎప్పుడూ మారదు. ఆ ఎంటర్టైన్మెంట్ ను మరోసారి పెద్ద తెరపై చూడాలనుకునేవారి కోసం వెంకీ సినిమాను డిసెంబర్ 30న రీ రిలీజ్ చేయబోతున్నారు. అంటే న్యూ ఇయర్ కు ముందు రవితేజతో పాటు ఎంటర్టైన్మెంట్ మూవీ లవర్స్ కు ఓ మంచి వినోదాన్ని మళ్లీ అందించబోతున్నారన్నమాట.

Telugu 70mm

Recent Posts

Everything is ready for the grand event of ‘Kalki’

The team is going to increase the speed in the campaign of 'Kalki 2898 AD'…

40 mins ago

Kiara about ‘Game Changer, War 2’ in Cannes..!

Bollywood beauty Kiara Advani made a splash at the prestigious International Film Festival Cannes. Kiara…

44 mins ago

సురేష్ ప్రొడక్షన్స్ ఆరంభించి అరవై ఏళ్లు

ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి.. ప్రపంచ రికార్డును నెలకొల్పి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. స్కిప్టుతో వస్తే..…

2 hours ago

‘కల్కి‘ గ్రాండ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎ.డి.‘ ప్రచారంలో స్పీడు పెంచబోతుంది టీమ్. తొలిసారి ఈ సినిమాకోసం గ్రాండ్…

2 hours ago

కేన్స్ లో ‘గేమ్ ఛేంజర్, వార్ 2‘ గురించి కియారా..!

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కేన్స్ లో సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. కేన్స్ లో జరిగిన…

3 hours ago

Once again ‘Godfather’ combination

Director Mohan Raja directed the movie 'Godfather' with Megastar Chiranjeevi. The film is a remake…

3 hours ago