రవితేజను ప్రాజెక్ట్ నుంచి తప్పించిన కమెడయన్.. ఏంటీ కరెక్ట్ గానే చదివామా అనుకుంటున్నారు కదూ.. కరెక్టే. ఓ కమెడియన్ తన ప్రాజెక్ట్ నుంచి మాస్ మహరాజ్ నే తప్పించాడట. ఈ విషయాన్ని స్వయంగా రవితేజనే ప్రకటించడంతో టాలీవుడ్ కూడా అవాక్కయింది. అయితే ఇదంతా ఫన్నీగానే చెప్పాడు మాస్ రాజా.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. కమెడియన్ వైవా హర్ష సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో మిర్యాల మెట్ట ఇంగ్లీష్ స్కూల్ లో చదువుతున్న ఓ అమ్మాయి రాసిన స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్ అని చెప్పిన సుందర్రావు అనే ఇంగ్లీష్ మాస్టర్ పదికి పది మార్కులు వేశాడు. కాకపోతే ఇందులో ఒక్క స్పెల్లింగ్ కూడా కరెక్ట్ కాదు. దీన్ని బట్టి ఆ మాస్టర్ కు ఎంత ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చో అర్థం అవుతుంది కదా. అయితే ఇది ఓ సినిమాకు సంబంధించిన అప్డేట్. ఈ అప్డేట్ ను కోట్ చేస్తూ రవితేజ ” తమరు అప్పుడు చెప్పిన కథ ఇదేనా మాస్టారూ.. మమ్మల్ని సైలెంట్ గా సైడ్ చేశారు ప్రాజెక్ట్ నుంచి ” అంటూ ట్వీట్ చేశాడు.
దీంతో హర్ష వెంటనే “సార్ సార్ నెక్ట్స్ అప్డేట్ లో రివీల్ చేద్దాం అని ప్లాన్ చేశామ్ సార్” రిప్లై ఇచ్చాడు. మొత్తంగా రవితేజ ఎంట్రీతో ఇలాంటి ఓ కొత్త కాన్సెప్ట్ తో సినిమా వస్తోన్న విషయం అందరికీ తెలిసిపోయింది. బట్ మాస్ మహరాజ్ సింపుల్ గా ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వకుండా ఫన్నీగా చేసిన ఈ ట్వీట్ ఆకట్టుకునేలా ఉండటంతో ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
విశేషం ఏంటంటే.. ఇది హర్ష ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా. అందుకే అతనికి హెల్పింగ్ సెయ్యడానికే రవితేజ ఇట్టా ట్వీటాడన్నమాట.
Comments are being heard that Telugu girls are starving in the Telugu film industry. At…
Sai Dhansika of 'Kabali' fame is a lady oriented movie 'Anthimatheerpu'. Amit Tiwari played another…
The team increased the speed in the promotion of the most awaited movie 'Kalki'. The…
Telugu film industry is haunted by series of controversies. Recently, actress Hema was arrested at…
Hollywood superhero movies are very crazy in India. Some of the superhero films related to…