మరోసారి అనిల్ రావిపూడి తో రవితేజ?

హిట్ కాంబినేషన్ కు వచ్చే క్రేజే వేరు. అదే కాంబోలో మరో సినిమా పడాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటారు. టాలీవుడ్ లో ఇప్పుడు పాత కాంబినేషన్స్ ను రిపీట్ చేయడంలో మాస్ మహారాజ రవితేజ స్పీడు పెంచుతున్నాడు. ఇప్పటికే తనతో మూడు సూపర్ హిట్స్ అందించిన మలినేని గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది.

మలినేని గోపీచంద్ తో పాటు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘భగవంత్ కేసరి‘ డైరెక్టర్ అనిల్ రావిపూడి తోనూ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట రవితేజ. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘రాజా ది గ్రేట్‘ మంచి విజయాన్ని సాదించింది. విశేషమేమిటంటే అటు మలినేని, ఇటు అనిల్ రావిపూడి ఇద్దరూ బాలకృష్ణతో సినిమా చేసిన తర్వాత వెంటనే రవితేజాతో సినిమా చేయబోతుండడం. అయితే.. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న రవితేజ-అనిల్ రావిపూడి సినిమాపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

మరోవైపు గతంలో తాను పనిచేసిన హరీష్ శంకర్, వి.వి.వినాయక్ లతోనూ సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట రవితేజ. మరి.. రవితేజాతో మరోసారి అంటోన్న ఈ డైరెక్టర్స్ లో ఎవరెవరు ఇమ్మీడియెట్ గా మాస్ రాజాతో సినిమాలు చేస్తారో చూడాలి.

Related Posts