యానిమల్ నుంచి రష్మిక బ్యూటీఫుల్ లుక్

సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తోన్న బాలీవుడ్ మూవీ యానిమల్. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతనికి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. డిసెంబర్ 1న విడుదల కాబోతోన్న ఈ మూవీ టీజర్ ను ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మొన్న రణ్‌బీర్ కపూర్ లుక్ విడుదల చేశాడు సందీప్.

ఇవాళ రష్మిక మందన్నా లుక్ రిలీజ్ చేసి టీజర్ డేట్ ను రిమైండ్ చేశాడు. ఈ సినిమా నుంచి వచ్చిన రష్మిక ఫస్ట్ లుక్ ఇదే కావడం విశేషం. సందీప్ తో పాటు రణ్‌బీర్ ఇమేజ్ లను బట్టి తను ఈ సినిమాలో ఓ గ్లామరస్ రోల్ చేయబోతోంది అనుకున్నారు. అందుకు భిన్నంగా పూర్తి సంప్రదాయబద్ధమైన పాత్రలో కనిపిస్తుంది అనేలా ఈ లుక్ ఉంది. పట్టుచీర, నుదట బొట్టు, మంగళసూత్రం(..?)తో తను ఏదో గుడికి వెళ్లినట్టుగా ఉందీ ఫోటో. రష్మిక ఈ లుక్ లో చాలా అందంగా కనిపిస్తోంది.


అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు సందీప్. దీంతో బాలీవుడ్ బిగ్గీస్ అంతా అతనితో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. వీరిలో కబీర్ సింగ్ నిర్మాతలకే మరో సినిమా చేస్తూ రణ్ బీర్ ను హీరోగా ఎంచుకున్నాడు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ ఓ ఫిజిక్స్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తాడట. అతని తండ్రి మాజీ గ్యాంగ్ స్టర్ అంటున్నారు. ఆ పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నాడు. అతనికి సంబంధించిన లుక్ కూడా విడుదలైంది.

ఫస్ట్ హాఫ్ లో ఫిజిక్‌స్ లెక్చరర్ గా చాలా సాఫ్ట్ గా కనిపించే రణ్‌బీర్ పాత్ర ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి వైల్డ్ గా మారుతుందట. అందుకు కారణం తన తండ్రిని కొందరు గ్యాంగ్ స్టర్స్ చంపేయడమే అంటున్నారు. ఈ పాయింట్ తోనే సందీప్ ఈ కథను తెరకెక్కించాడు అనేది బాలీవుడ్ టాక్. ఇందులో నిజమెంత అనేది డిసెంబర్ 1న తేలిపోతుంది.

Related Posts