టాలీవుడ్

తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం రామోజీరావు

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే అత్యున్నత పరిశ్రమగా రాజ్యమేలుతోంది. టాలీవుడ్ గ్రేటెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారడం వెనుక.. హైదరాబాద్ సినీ పరిశ్రమకు కేంద్రంగా భావించడం వెనుక రామోజీ ఫిల్మ్ సిటీ కూడా కారణం. టాలీవుడ్ టు బాలీవుడ్ అన్ని పరిశ్రమలకు సంబంధించిన చిత్రాలు రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంటాయి. స్క్రిప్ట్ తో వెళ్లిన వారు.. ఫైనల్ అవుట్ పుట్ తో బయటకు వచ్చేలా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన ప్రతీ అంశం రామోజీ ఫిల్మ్ సిటీలో అందుబాటులో ఉంటుంది.

దేశం గర్వించదగ్గ ఫిల్మ్ సిటీని నిర్మించడం కంటే ముందే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అత్యద్భుత చిత్రాలు నిర్మించిన ఘనత రామోజీరావు సొంతం. చిన్న సినిమాలతో పెద్ద విజయాలు సాధించారు రామోజీరావు. తొలుత సందేశాత్మక, వాస్తవ జీవిత సంఘటలకు సంబంధించిన కథలతో సినిమాలు చేసి విజయాలు సాధించారు. సుధా చంద్రన్ జీవిత కథతో ఆమే కథానాయికగా రూపొందిన ‘మయూరి’, అశ్వని నాచప్ప కథాంశంతో ఆమే కథానాయికగా వచ్చిన ‘అశ్వని’ సినిమాలు వాస్తవ కథాంశాలకు ప్రతిరూపంగా ఉషాకిరణ్ మూవీస్ నుంచి విజయాలు సాధించాయి.

ఇక.. ‘ప్రతిఘటన, మౌనపోరాటం, పీపుల్స్ ఎన్‌కౌంటర్’ వంటి సినిమాలు సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ప్రతిరూపాలు. అలాగే.. ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు సినిమాలు నిర్మించ‌డంలో ఆయ‌న‌కి ఆయ‌నే సాటి. 2000 సమయంలో చిన్న బడ్జెట్ లో భారీ విజయాలు సాధించిన చిత్రాలను అందించారు రామోజీరావు. ఆ చిత్రాలే ‘చిత్రం, నువ్వేకావాలి, ఆనందం’. ఈ మూడు సినిమాలూ ఉషాకిరణ్ మూవీస్ కి కాసులు కురిపించాయి. ఈ సినిమాల ద్వారా పరిచయమైన ఉదయ్ కిరణ్, తరుణ్ కొన్నాళ్లుగా కథానాయకులుగా దుమ్మురేపారు. ఈ సినిమాలు తేజ, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్.పి.పట్నాయక్ వంటి టెక్నీషియన్స్ స్థానాన్ని చిత్ర పరిశ్రమలో సుస్థిరం చేశాయి.

ఈ సంస్థ చివరిగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ‘దాగుడు మూతలు దండాకోర్’ సినిమా చేసింది. ఆ తర్వాత చిత్ర నిర్మాణాన్ని తగ్గించింది. ఉషాకిరణ్ మూవీస్ నుంచి అన్ని భాషల్లోనూ దాదాపు 85 సినిమాల వరకూ వచ్చాయి. వంద సినిమాలు నిర్మించాలనేది రామోజీరావు కోరిక. అయితే.. అనుకున్న స్థాయి కథలు రాకపోవడంతో ఉషాకిరణ్ మూవీస్ సినీ నిర్మాణం తగ్గిస్తూ వచ్చింది.

Telugu 70mm

Recent Posts

రాజ్ తరుణ్ యాక్షన్ అవతార్ లో ‘తిరగబడరసామీ..‘

యంగ్ హీరో రాజ్ తరుణ్ యాక్షన్ అవతారమెత్తాడు. సీనియర్ డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరసామీ..‘ అనే సినిమాతో ప్రేక్షకుల…

13 hours ago

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్

‘బలగం‘ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.…

15 hours ago

‘డార్లింగ్‘ నుంచి నభా నటేష్ ‘రాహి రే‘ సాంగ్

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘డార్లింగ్‘. ఈ మూవీలో అనన్య నాగళ్ల, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్…

15 hours ago

Ashika Ranganath

15 hours ago

వెంకటేష్ సరసన కథానాయికలు ఖరారు..!

విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే హ్యాట్రిక్ మూవీ రేపు ముహూర్తాన్ని జరుపుకోనుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన…

16 hours ago

తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కండిషన్స్

సినిమాలు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే కాదని.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి…

16 hours ago