స్టైలిష్ లుక్ లో సర్ప్రైజ్ చేసిన రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన లుక్ మొత్తం మార్చేశాడు. అల్ట్రా మోడర్న్ లుక్ లో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశాడు. లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఓ ఈవెంట్ లో సందడి చేశాడు రామ్. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ షర్ట్ వేసుకున్న రామ్.. కూల్ గ్లాసెస్ పెట్టుకుని మోడర్న్ లుక్ లో మెస్మరైజ్ చేశాడు.

సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’తో బిజీగా ఉన్నాడు ఎనర్జిటిక్ స్టార్. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్‘ సూపర్ హిట్ కావడంతో ‘డబుల్ ఇస్మార్ట్‘పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘డబుల్ ఇస్మార్ట్’ జూన్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts