అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న అల్లు అర్జున్.. జపాన్ వెళుతున్న పుష్పరాజ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బుధవారం ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయంలో సందడి చేశాడు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసమే ఆయన ఆర్.టి.ఓ. ఆఫీస్ కు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. అలాగే తన కొత్త కారు రేంజ్‌ రోవర్‌ ను రిజిష్ట్రేషన్ చేయించుకున్నాడట. తన కారు నంబర్ TG 09 0666. అయితే.. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ప్రధాన కారణం.. ‘పుష్ప 2’ కోసమే అనే ప్రచారం జరుగుతుంది.

ఇటీవల వైజాగ్ లో ఓ చిన్న షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ‘పుష్ప 2’ మళ్లీ హైదరాబాద్ లో యదావిధిగా షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ టీమ్ జపాన్ వెళ్లబోతుందట. అక్కడ పుష్ప రాజ్ చేసే రేసీ యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. అందుకోసమే ప్రత్యేకించి అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ‘పుష్ప 2’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts