టాలీవుడ్

కొత్త సినిమాకి శ్రీకారం చుట్టిన రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గత చిత్రాలు ‘ది వారియర్, స్కంద’ ఆశించిన విజయాలు సాధించలేదు. ఈనేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’తో భారీ విజయం సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు ఉస్తాద్ రామ్. ‘డబుల్ ఇస్మార్ట్’ ఫినిషింగ్ స్టేజ్ కు రావడంతో కొత్త సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రామ్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుంది. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఈ ప్రాజెక్ట్ సెట్ చేశారని వినిపించింది. అయితే.. త్రివిక్రమ్-రామ్ మూవీపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. మరో యంగ్ డైరెక్టర్ తో ఎనర్జిటిక్ స్టార్ సినిమా చేయబోతున్నాడనేది లేటెస్ట్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.

అనుష్క తో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చేసి హిట్ కొట్టిన మహేష్ తో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడట రామ్. ఈ సినిమా సైలెంట్ గా ముహూర్తాన్ని కూడా పూర్తిచేసుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందే ఈ చిత్రాన్ని వచ్చే వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Telugu 70mm

Recent Posts

Sreeleela

2 hours ago

Hebah Patel

3 hours ago

Shruti Haasan in U.V Creations

Star daughter Shruti Haasan is one of the heroines who has a long association with…

3 hours ago

Documentary on Rajamouli on Netflix

Director Rajamouli is a trend setter. A great filmmaker who put Indian cinema on a…

3 hours ago

‘Pushpa 2’ Rehearsals For Climax

Sukumar is a director who is first recognized as a creative genius in the Telugu…

3 hours ago