‘వ్యూహం‘ సెన్సార్ సర్టిఫికెట్ తో రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒకప్పుడు క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ గా చూసేవారు. టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో చక్రం తిప్పిన ఘనత వర్మ ది. సినిమాలను ఓ ఫ్యాక్టరీ పద్ధతిలో నిర్మించిన రామ్ గోపాల్ వర్మ.. ఎంతోమంది శిష్యులను రెడీ చేసి ఇండస్ట్రీకి అందించాడు. అలాంటి వర్మ ఇప్పుడు వివాదాలకు అడ్డాగా మారాడు. రామ్ గోపాల్ వర్మ ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నాడనే విమర్శలు చాన్నాళ్ల నుంచి వినిపిస్తున్నాయి. ఈ కోవలోనే.. వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం‘ సిరీస్ సెన్సార్ అడ్డంకులను ఎదుర్కొంది.

అయితే.. లేటెస్ట్ గా ‘వ్యూహం‘ సిరీస్ లోని రెండు చిత్రాలు ‘వ్యూహం, శపథం‘ వారం గ్యాప్ లోనే విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రాలలో మొదటి భాగం ‘వ్యూహం‘ మార్చి 2న విడుదలకు ముస్తాబవుతోంది. దాదాపు 500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లేటెస్ట్ గా ఓ ట్వీట్ చేశాడు వర్మ. కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను చూపిస్తూ.. ‘పట్టు వదలని విక్రమార్కుడిని’ అంటూ తన ట్వీట్ కి మెస్సేజ్ పెట్టాడు.

Related Posts