HomeEnglishTollywoodశభాష్ .. అలియా.. కంగ్రాట్స్ కృతి

శభాష్ .. అలియా.. కంగ్రాట్స్ కృతి

-

బాలీవుడ్ లో నెపో కిడ్ అని, తెలివి లేనిది అంటూ కొన్నాళ్ల క్రితం విపరీతంగా ట్రోలింగ్ కు గురైన నటి అలియా భట్. ముఖ్యంగా కంగనా రనౌత్ ఆమెను ప్రతిసారీ విమర్శించింది. ఏ చిన్న సందర్భం వచ్చినా దారుణంగా హేళన చేస్తూ సోషల్ మీడియాలో ఎటాక్ చేసింది. బట్ నటన పరంగా అలియా భట్ మరీ కంగనా చెప్పేంత వీక్ కాదు. నెపోకిడ్ కావొచ్చు. కానీ కెరీర్ ఆరంభంలోనే చేసిన హైవే లాంటి సినిమా చాలు తనెంత టాలెంటెడో చెప్పడానికి. ఆ ప్రతిభను పెంచుకుంటూ ఒక్కో సినిమాకూ మెరుగవుతూ వచ్చింది. తెలుగులోనూ ఆర్ఆర్ఆర్ తో ఆకట్టుకుంది.

ఇక బెస్ట్ యాక్ట్రెస్ నేషనల్ అవార్డ్ రేస్ లోఇప్పుడు కంగనాతో పాటు అలియా కూడా రేస్ లో నిలిచింది. అంతా మళ్లీ కంగనాకే అవార్డ్ వెళుతుందనుకున్నారు. అందుకు కారణాలేంటో కూడా అందరికీ తెలుసు. బట్ ఈ సారి కంగనా లాబీ ఫలించలేదు. అలియా భట్ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది. గంగబాయ్ కతియావాడి చిత్రంలో తను చూపించిన అత్యద్భుత నటనకు గానూ ఆమెను ఈ పురస్కారం వచ్చింది.

అయితే ఈ అవార్డ్ ను తను మరో నటి కృతి సనన్ తో కలిసి పంచుకోవాల్సి వచ్చింది. అయినా సరే.. జాతీయ ఉత్తమ నటి అనేది క్లియర్. కృతి సనన్ కు మిమి చిత్రంలోని నటనకు గానూ జాతీయ పురస్కారం దక్కింది. ఈ అవార్డ్ ను ఇద్దరూ కలిసి పంచుకోవాల్సి ఉంటుందన్నమాట.

మొత్తంగా ఏ కంగనా రనౌత్ తనను డీ గ్రేడ్ చేసిందో ఆ కంగనతోనే పోటీలో నిలిచి మరీ విజేతగా మారింది చూడూ.. అందుకు అలియా భట్ ను శభాష్ అనాల్సిందే. అన్నట్టు అలియాకు మన ఎన్టీవోడు స్పెషల్ శుభాకాంక్షలు కూడా చెప్పేశాడు.

ఇవీ చదవండి

English News