‘ఓ మై లిల్లీ’.. అంటున్న టిల్లు స్క్వేర్‌

సిద్దు జొన్నలగడ్డ సెన్సేషనల్ హిట్ మూవీ డిజె టిల్లు. నేహాశెట్టి ఫిమేల్ లీడ్ చేసిన ఈ మూవీ కి సీక్వెల్‌ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతుంది. అట్లుంటది మనతోని అంటూ టిల్లు వేసిన మార్క్‌ మామూలుది కాదు.

టిల్లు మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆడియెన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. మల్లిక్‌రామ్‌ డైరెక్షన్‌లో రాబోతున్న టిల్లు స్క్వేర్ లో యూత్ హార్ట్‌త్రోబ్‌ అనుపమ పరమేశ్వరన్‌ ఫీమేల్ లీడ్ చేస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజయిన అప్‌డేట్స్‌ వైరల్ అవుతున్నాయి.


‘టిల్లు స్క్వేర్’ నుంచి ఇప్పటికే విడుదలైన ‘టికెటే కొనకుండా’, ‘రాధిక’ పాటలు విశేష ఆదరణ పొందాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ మై లిల్లీ’ అనే పాట విడుదలైంది. సోమవారం వారం సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో అభిమానుల కోలాహలం మధ్య జరిగిన వేడుకలో ఈ పాటను విడుదల చేశారు.


ఈ సినిమా విజయం పట్ల నటీనటులు, టెక్నిషియన్స్ నమ్మకం వ్యక్తం చేసారు. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. రామ్ మిరియాల, అచ్చు రాజమణి ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు

Related Posts