టాలీవుడ్

రాజ్ తరుణ్ ‘తిరగబడరసామీ’ నుంచి సెలబ్రేషన్ సాంగ్ విడుదల

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి సెలబ్రేషన్ సాంగ్ ని విడుదల చేశారు. కంపోజర్ జేబీ ఈ పాటని పర్ఫెక్ట్ సెలబ్రేషన్ నెంబర్ గా కంపోజ్ చేశారు. లిప్సికా భాష్యం, అదితి బావరాజు, చైతు సత్సంగి వీనుల విందుగా అలపించారు. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటలో విజువల్స్ కన్నుల పండగలా వున్నాయి.

యువతని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందీ బిగ్ బాస్ తో యావత్ భారతాన్ని అలరించిన మనరా చోప్రా ఈ చిత్రంలో ఓ విభన్న పాత్రతో పాటు ప్రత్యేక గీతంతో అలరించబోతుంది.ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్.ఫిబ్రవరి 23న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Telugu 70mm

Recent Posts

Eesha Rebba

32 seconds ago

ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో పడేసిన ప్రభాస్ పోస్ట్

రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకి చాలా లేటుగా ఎంటరయ్యాడు. పైగా ప్రభాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అరుదుగా ఉంటాయి.…

27 mins ago

హైకోర్టుకు చేరిన ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం

జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని…

5 hours ago

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తో ఐశ్వర్య అనుబంధం

ఫ్రాన్స్ లోని కేన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఈ ఏడాది 77వ కేన్స్…

5 hours ago

థియేటర్ల మూసివేత మా దృష్టికి రాలేదు.. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్

ఎన్నికలు, IPL కారణంగా తక్కువ ఫుట్ ఫాల్ ఉండడంతో థియేటర్లకు నష్టం జరిగింది. తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ…

5 hours ago

‘Love Me’ Trailer.. A ghost story coming from Dil Raju’s compound

Producer Dil Raju, who has entertained with family entertainers till now, is bringing a ghost…

5 hours ago