రాఘవ లారెన్స్ కొత్త చిత్రం ‘హంటర్‘

సీనియర్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ కొత్త సినిమాని ప్రకటించాడు. లారెన్స్ హీరోగా నటిస్తున్న 25వ సినిమా ఇది. ఈ మూవీకి ‘హంటర్‘ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘ది బ్యాటిల్ ఫర్ ది సూల్‘ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. షాడో షాట్ లో లారెన్స్ ఓ పులిపై నిలబడినట్టు కనిపిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక.. ఇప్పటివరకూ హిందీ డబ్బింగ్ మూవీస్ లో అగ్రగామి సంస్థగా ఉన్న గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ ఫస్ట్ టైమ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి ఎంటరవుతోన్న చిత్రమిది.

Related Posts