జూన్ 13న రాబోతున్న ‘ఇండియన్ 2‘?

విశ్వ నటుడు కమల్ హాసన్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఇండియన్ 2‘. ఆల్ టైమ్ క్లాసిక్ ‘ఇండియన్‘కి సీక్వెల్ గా వస్తోన్న చిత్రమిది. 1996లో విడుదలైన ‘ఇండియన్‘కి తెలుగు అనువాదం ‘భారతీయుడు‘. తమిళ ఒరిజినల్ కి దీటైన విజయాన్ని సాధించింది ‘భారతీయుడు‘. అందుకే.. ఇప్పుడు ‘ఇండియన్ 2‘ని తెలుగులో ‘భారతీయుడు 2‘గా విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ‘భారతీయుడు 2‘ని జూన్ లో విడుదల చేస్తున్నామని ఆమధ్య ప్రకటించారు. అయితే.. విడుదల తేదీపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. లేటెస్ట్ కోలీవుడ్ టాక్ ప్రకారం ‘భారతీయుడు 2‘ని జూన్ 13న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అప్పటికి ఎన్నికల హడావుడి ముగిసిపోతుండడంతో ‘భారతీయుడు 2‘కి అన్ని విధాలుగా కలిసొస్తుందని భావిస్తోందట టీమ్. ఈ సినిమాలో కమల్ హాసన్ కి జోడీగా కాజల్ కనిపించబోతుంది. ఇతర ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. శంకర్ తన రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ని పక్కనపెట్టి ఈ చిత్రంకోసం అనిరుధ్ ని తీసుకున్నాడు. మొత్తంమీద.. కమల్-శంకర్ మరోసారి ‘భారతీయుడు‘ సీక్వెల్ తో కరప్షన్ పై ఏ విధంగా కదం తొక్కుతారో చూడాలి.

Related Posts