‘పుష్ప 2’ ఆల్బమ్ అదిరిపోతుందట!

దర్శకధీరుడు రాజమౌళికి కీరవాణి ఎలాగో.. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కి దేవిశ్రీప్రసాద్ అలాగ. తన తొలి చిత్రం ‘ఆర్య’ నుంచి ఇప్పుడు ‘పుష్ప 2’ వరకూ సుకుమార్ ప్రతీ చిత్రానికీ దేవిశ్రీయే మ్యూజిక్ డైరెక్టర్. అంతలా వీరిద్దరి కాంబో వర్కవుట్ అవుతూ వస్తోంది.

సుకుమార్, దేవిశ్రీలకు తోడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కలిస్తే ఆ ఆల్బమ్ ఆల్ టైమ్ చార్ట్ బస్టర్ అయినట్టే. ఇప్పటికే ‘ఆర్య, ఆర్య 2, పుష్ప 1’లలో ఇది నిరూపించారు వీరు ముగ్గురూ. ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం ప్రేక్షకుల్ని మరోసారి తమ పాటలతో మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే స్పెషల్ గా రిలీజవుతోన్న టీజర్ కోసం.. బి.జి.ఎమ్. అదరగొట్టాడట రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్. ఆ టీజర్ కోసమే లేటెస్ట్ గా అల్లు అర్జున్, సుకుమార్.. దేవిశ్రీప్రసాద్ స్టూడియోలో సందడి చేశారు. అలాగే.. ‘పుష్ప 2’ పాటలకు సంబంధించిన మ్యూజికల్ సెషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయట. మరి.. ‘పుష్ప 1’కి మించిన రీతిలో ‘పుష్ప 2’ ఆల్బమ్ అదరగొడుతుందేమో చూడాలి.

Related Posts