ప్రియదర్శి, నభా నటేష్ గొడవ ఏంటి?

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నారు మేకర్స్. అప్పట్లో సినిమాల ప్రచారం విషయంలో దర్శకనిర్మాతలే ఎక్కువగా తర్జనభర్జనలు పడేవారు. ఇప్పుడు హీరోహీరోయిన్లు కూడా సామాజిక వేదికల ద్వారా తమ సినిమాలకోసం పబ్లిసిటీని నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాలలో హీరోహీరోయిన్లు తమ మధ్య ఏదో కాంట్రవర్శీ ఉన్నట్టు అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేసి.. చివరకు అదొక సినిమా అనౌన్స్ మెంట్ అంటూ క్లారిటీ ఇచ్చేస్తున్నారు.

లేటెస్ట్ గా టాలీవుడ్ లో ప్రియదర్శి, నభా నటేష్ మధ్య ఇలాంటి కాన్వర్సేషన్ జరిగింది. అసలే మ్యాటర్ ఏంటేంటే.. నభా నటేషా ‘ఎక్స్‘లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో.. ‘ప్రభాస్‌ డార్లింగ్.. డార్లింగ్.. అంటూ పిలిచే ఒరిజినల్ వాయిస్‌ను తన యాక్టింగ్‌తో మ్యాచ్‌ చేసింది. ఇక.. ఈ వీడియోకి ‘వావ్ సూపర్ డార్లింగ్.. కిర్రాక్ గా ఉన్నావ్ డార్లింగ్..‘ అంటూ రిప్లై ఇచ్చాడు ప్రియదర్శి.

ఇక ప్రియదర్శి చేసిన ఈ ట్వీట్‌కు కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చింది నభా..! ఏదైనా కామెంట్ చేసేటప్పుడు మీ పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి? అంటూ ప్రియదర్శికి చురకలు అంటిస్తూనే.. ఎవరో తెలియని అమ్మాయిని డార్లింగ్ అని పిలవడం సెక్స్‌వల్ హరాస్మెంట్ కిందికి వస్తుందని.. IPC 354A ప్రకారం అది చట్టరిత్యా నేరం అని తెలిసేలా.. ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును ఓ ఫోటో రూపంలో షేర్ చేసింది. ఇక అందుకు ప్రియదర్శి.. ‘మనం ఇద్దరం అన్‌ నోన్ అని తెలియదు. అయినా మీరు డార్లింగ్ అంటూ పర్లేదే మేం అంటేనే సెక్షన్లు కేసులా? లైట్ తీసుకో డార్లింగ్ అంటూ.. మరో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కి.. డోంట్ క్రాస్ ది లైన్స్‌! చూసుకుందామ్ అంటూ.. మరో ట్వీట్ చేసింది. ఇలా పోటా పోటీగా వీరిద్దరూ ట్వీట్లు చేసుకోవడం.. వీరిమధ్య ఏదో కాంట్రవర్శీ వచ్చిందని అందరూ అనుకున్నారు.

కట్ చేస్తే.. ప్రియదర్శి, నభా నటేష్ కలిసి చేసే సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఈ ట్వీట్స్ వార్ అని ఇండస్ట్రీ టాక్. వీరి సినిమాకి ‘డార్లింగ్‘ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రేపే ప్రియదర్శి, నభా నటేష్ కలిసి నటించే మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

Related Posts