‘ప్రతినిధి 2’ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న అమోఘ ఎంటర్ టైన్ మెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇలాంటి తరుణంలో థియేటర్లలోకి రాబోతున్న అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’. ఇప్పటికే మంచి విజయాన్ని సాధించిన ‘ప్రతినిధి’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. విలక్షణమైన పాత్రలతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్ నటించిన ఈ చిత్రానికి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించడం విశేషం.

పాలనలో అవినీతిని ప్రశ్నించే ఒక జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ కనిపించబోతున్నాడు. ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టే రీతిలో ఎన్నో అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట దర్శకుడు మూర్తి. ఏప్రిల్ 25న ‘ప్రతినిధి 2’ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ను అమోఘ ఎంటర్ టైన్ మెంట్స్ దక్కించుకుంది.

Related Posts