ఏప్రిల్ 25 నుంచి ఓటీటీ లోకి ‘భీమా’

గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భీమా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 25 నుంచి ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎ హర్ష దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ నటించారు. పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో తెరకెక్కిన ‘భీమా’ సినిమా మార్చి 8న థియేటర్స్ లోకి వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ‘భీమా’. ముఖ్యంగా బి, సి సెంటర్స్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. దీంతో.. ‘భీమా’ చిత్రం ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు వస్తోందా? అని ఆసక్తితో ఎదురుచూస్తున్న గోపీచంద్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

Related Posts