ప్రశాంత్ నీల్ తోనూ ఎన్టీఆర్ డబుల్ ధమాకా!

ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా సినిమాల విషయంలో ఈ ఒరవడిని ఫాలో అవుతున్నారు మేకర్స్. ఈకోవలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా రెండేసి భాగాల చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ‘దేవర’ చిత్రాన్ని రెండు పార్ట్స్ గా తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన తారక్.. త్వరలో పట్టాలెక్కే ప్రశాంత్ నీల్ సినిమాని రెండు భాగాలుగా తీసుకురానున్నాడట.

ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి. అసలు ఈపాటికే పట్టాలెక్కాల్సిన ఈ సినిమా వీరిద్దరూ వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండడంతో కాస్త ఆలస్యమయ్యింది. ప్రస్తుతం ‘దేవర 1’ని ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చిన తారక్.. త్వరలో ‘వార్ 2’ సెట్స్ లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో బిజీ అవ్వనున్నాడు.

ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఈ సినిమాని కూడా ‘కె.జి.యఫ్, సలార్’ తరహాలో రెండు పార్టులుగా పెద్ద కాన్వాస్ పై తీర్చిదిద్దుతున్నాడట. ఎన్టీఆర్ సినిమాని పది దేశాల్లో చిత్రీకరించేందుకు ప్లానింగ్ రెడీ అవుతోందట. మొత్తంమీద.. త్వరలోనే ఈ క్రేజీ మూవీకి గ్రాండ్ లెవెల్ లో ఓపెనింగ్ సెరమనీ నిర్వహించనున్నారట.

Related Posts